అనంతపురం

బయోమెట్రిక్ మిషన్లను అందించిన సంస్థపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, అక్టోబర్ 21: జిల్లాలోని పాఠశాలలకు లోపభూయిష్టమైన బయోమెట్రిక్ మిషన్లను సరఫరా చేసిన సంస్థపై చర్యలు తీసుకోవావలని ఎన్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కరుణం హరికృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక హిందీ సేవా సదన్ కార్యాలయంలో ఎన్‌టీఏ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు నాణ్యత లేని, లోపభూయిష్టమైన బయోమెట్రిక్ మిషన్లను పంపిణీ చేశారని ఆరోపించారు. దీంతో ఏ ప్రాంతంలోను ఈ మిషన్లు పనిచేయడం లేదని పేర్కొన్నారు. పాఠశాలలకు సరఫరా చేసిన బయోమెట్రిక్ మిషన్‌లు పిల్లలు ఆడుకునే బొమ్మలుగా బయోమెట్రిక్ మిషన్‌లుగా మారాయని విమర్శించారు. వీటిని సరఫరా చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బయోమెట్రిక్ మిషన్ల స్థానంలో నూతనంగా నాణ్యమైన మిషన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే పాఠశాలల్లో వౌళిక సదుపాయాలు కల్పించకపోవడంతో విద్యార్థినీ, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అన్ని పాఠశాలల్లో వౌళిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎన్‌టీఏ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.