అనంతపురం

అన్ని విద్యాసంస్థల్లో సీఓఎల్‌ఎస్‌పై అవగాహన నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, అక్టోబర్ 23: జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో సీఓఎల్‌ఎస్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ జీ.వీరపాండ్యన్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక వైద్య కళాశాలలోని సెంట్రల్ హాల్ నందు భారతీయ అనస్తీషియా సంఘం, జిల్లా ప్రధాన ఆసుపత్రి అనస్తీషియా శాఖ ఆధ్వర్యంలో మనిషి గుండె అగిపోతే, కుప్పకూలిపోతే ఏమి చేయాలి అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి అనస్తీషియా పితామహుడైన డబ్ల్యూటిజీ మార్జెన్ చిత్రపటంను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనిషి ఉన్నపళంగా స్పృహ తప్పి పడిపోయినపుడు వెంటనే ఆ మనిషిని సురక్షితమైన ప్రదేశానికి తరలించి, మనిషిని పడుకోబెట్టి స్పందనను గమనించాలన్నారు. తదుపరి ప్రాథమిక చికిత్స అందించడంవంటి కార్యక్రమాలపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని తెలిపారు. ప్రాణ రక్షకుడు ప్రతి ఇంటిలో వుంటాడని, ఇటువంటి అవగాహన సదస్సులను జిల్లా అంతటా నిర్వహించి, అందుకు తనవంతు సహాయ సహకారాలను అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. రబ్బరు బొమ్మను పడుకోబెట్టి ఛాతిపై నొక్కడం, తదుపరి చికిత్సలందించడంవంటి కార్యక్రమాలను కలెక్టర్ ప్రారంభించారు.

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి
అనంతపురం సిటీ, అక్టోబర్ 23: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఓటరు జాబితా పరిశీలకులు శ్రీనివాస్, నరేష్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవిన్యూ భవన్‌లో వివిధ రాజకీయ పార్టీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో ఓటర్లు జాబితాపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావలెనని, అనర్హులను ఓటరు జాబితాల నుండి తొలగించాలని అందుకు రాజకీయ పార్టీ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని, తప్పులు లేని ఓటర్ల జాబితా తయారీకి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. అలాగే ప్రజలు కూడా ఇందుకు సహకరించి ఓటరుగా నమోదు కావాలన్నారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో అర్హులైన వారిని నూరు శాతం ఓటర్లుగా చేర్పించాలని కోరారు. ఓటర్లుగా నమోదుకు నిరంతర ప్రక్రియ వుంటుందని, అందుకు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పక్షాలు వెంటనే ప్రతి పోలింగ్ బూత్‌కు ఒక బూత్ లెవెల్ ఏజెంట్‌ని నియమించాలని, వారి ద్వారా ఓటర్లు జాబితా శుద్దీకరణ అవుతుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ జీ.వీరపాండ్యన్ మాట్లాడుతూ జిల్లాలో 2014 సంవత్సరం నుండి 2018 వరకు అనర్హులను ఓటరు జాబితాలో నిరంతరం తొలగించడం జరుగుచున్నదని, అర్హులను ఓటరుగా చేర్చడం జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,21,938 మంది నమోదుకు, తప్పులకు దరఖాస్తు అందాయని తెలిపారు. రాజకీయ పక్షాల ప్రతినిధులు తమ సమస్యలు ఏవైనా వుంటే తెలియజేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ శింగనమల నియోజకవర్గంలోని నార్పల, కూచివారిపల్లి, చాలంపల్లి తదితర గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఓటర్లకు అనుకూలంగా లేవని, ఓటర్ల నమోదులో అంగన్‌వాడీ వారిని నియమించారని, అనర్హులను తొలగించాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలో 64,000 ఓట్లు తొలగించారని, చాలామంది ఇప్పటికీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవి తిరస్కరిస్తారని అపోహ వున్నదని, ఆధార్ అనుసంధానం ఓటర్లకు ఉండేటట్లు చూడాలని కోరారు. వీటిపై కలెక్టర్ స్పందిస్తూ తక్షణమే వీటిని పరిష్కరించాలని డీఆర్‌ఓను ఆదేశించారు.

12వ తేదీ నుండి సమ్మెటీవ్-1 పరీక్షలు
అనంతపురం సిటీ, అక్టోబర్ 23: నవంబర్ 12వ తేదీ నుండి 6వ తరగతి నుండి పదవ తరగతి వరకు సమ్మెటీవ్-1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు మంగళవారం విద్యా శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షలు నవంబర్ 12వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందులరో 6,7,8 తరగతులకు పరీక్షలు ఉదయం 10 గంటల నుండి 12:45 గంటల వరకు, 9, 10వ తరగతులకు మధ్యాహ్నం 2 గంటల నుండి 4:45 గంటల వరకు జరగనున్నాయి. అలాగే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు నవంబర్ 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఉదయం 9:30 గంటల నుండి 12 గంటల వరకు జరుగనున్నట్లు విద్యా శాఖ ఉత్తర్వులను పాఠశాలకు అందజేశారు.