అనంతపురం

అగ్రిగోల్డ్ బాధితులకు అండగా బీజేపీ ఉద్యమిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, అక్టోబర్ 23: రాష్ట్రంలో 40 లక్షల అగ్రిగోల్డ్ బాధితులు అండగా బీజేపీ ఉద్యమిస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగంరెడ్డి అంకాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల తరపున నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల అగ్రిగోల్డ్ బాధితులను టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బాధితులు డబ్బులు వస్తాయా రావో అని అయోమయంలో ఉన్నారని తెలిపారు. 16 వేల కోట్లు ఆస్తులు 2 వేల కోట్లకి ఎలా తగ్గుతాయని ప్రశ్నించారు.

కరవు నివారణ చర్యలపై అవగాహన
అనంతపురం సిటీ, అక్టోబర్ 23: జిల్లాలో ఈ నెల 24, 25వ తేదీల్లో కరవు నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ సంయుక్త సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 24వ తేదీన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాల్‌లో వ్యవసాయ, పశుసంవర్థక, ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ, ఏపీఎంఐపీ, డ్వామా, మత్స్య, నీటిపారుదల శాఖ, స్వచ్ఛంద సంస్థల అధికారులతో అవగాహన, 25వ తేదీన రాప్తాడు మండలంలోని హంపాపురం, ఎం.చెర్లొపల్లి, కనగానపల్లి మండలంలోని ముక్తాపురంలో గ్రామస్థాయిలో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు తెలిపారు.

విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ
అనంతపురం కల్చరల్, అక్టోబర్ 23: శ్రీ షిర్డిసాయిబాబా సేవా సంఘం ఆధ్వర్యంలో షిర్డిసాయి మహాసమాధి శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు, దుప్పట్లు పంపిణీ చేశారు. కురుగుంట అంథుల ఆశ్రమం, రోటరీపురం జీవని అనాథాశ్రమం, ఉప్పరపల్లిలోని బైబిల్ మిషన్ చర్చి ఆశ్రమాల్లోని 150 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు.

రైతు కవాతుకు ఏపీ రైతు సంఘం మద్దతు
అనంతపురం కల్చరల్, అక్టోబర్ 23: ఈ నెల 29న సీపీఎం, సీపీఐ పార్టీలు తలపెట్టిన రైతు కవాతుకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఏపీ రైతు సంఘం ప్రకటించింది. మంగళవారం రైతు సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తరిమెల నాగరాజు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ 2018 ఖరీఫ్ పంట రుణాలు మాఫీ చేసి, ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ ప్రకటించాలని, 4, 5 విడతల రుణమాఫీని ఒకేసారి విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో వరుస కరవులతో పంటలు లేక, పండిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక అప్పులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. 29న నిర్వహించే రైతు కవాతుకు రైతులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలన్నారు.