అనంతపురం

డిగ్రీ కళాశాలల్లో పోటీ పరీక్షలకు కొరకు రూ. 10 లక్షల నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, అక్టోబర్ 23: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వివిధ పోటీ పరీక్షల కొరకు ఆహ్లాదకరమైన లైబ్రరీ, అవసరమైన పుస్తకాల కొనుగోలుకు ఒక్కొక్క డిగ్రీ కాలేజికి రూ.10 లక్షల నిధులు మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ జీ.వీరపాండ్యన్ తెలిపారు. అందుకు సంబంధిత కాలేజి ప్రిన్సిపాల్స్ ప్రణాళికలు తయారుచేసుకొని నివేదికలు సీపీఓకు అందజేయాలన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాల్‌నందు ఈ నెల 25, 26వ తేదీల్లో అమరావతిలో జరిగే కలెక్టర్లు సదస్సు సన్నిదతపై సేవారంగ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగానికి తాను అధిక ప్రాధాన్యతనిస్తున్నానని, కరవు జిల్లా అయిన అనంత జిల్లాలో నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో వున్నారని, వారిని జీవన ప్రమాణా స్థాయిని పెంచడానికి జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు, ఎంప్లాయిమెంట్ అధికారి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థల ద్వారా అనేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి యువతకు ఉపాధి దొరికేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అన్ని విద్యాసంస్థల్లో స్వచ్చ భారత్ కార్యక్రమం ద్వారా వౌలిక వసతులు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. త్వరలో ఆటో రంగంలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన 50 మంది ఐటీఐ విద్యార్థులను గుర్తించి వారికి కియా కార్ల కంపెనీనందు అంప్రెటీస్ సౌకర్యం కలుగజేయడం జరుగుతుందన్నారు. అందుకు ఐటీఐ ప్రిన్సిపాల్స్, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కాలేజిల్లో ల్యాబ్ సౌకర్యం ఏర్పాటుచేయడం జరుగుతుందని, అందుకు నివేదికలు సిద్దం చేసుకోవాలని ఇన్‌చార్జి డిస్ట్రిక్ ఒకేషనల్ వృత్తి విద్యాధికారి చంద్రశేఖర్‌రావును ఆదేశించారు. జిల్లాలోని 3 మోడల్ స్కూల్ భవన నిర్మాణ పనులకు భూమి సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందుకు జిల్లా విద్యా శాఖాధికారి ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళికలు తయారుచేసి నివేదికలను అందజేయాలన్నారు. ఐటీఐ, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలని అందుకు విద్యా శాఖాధికారులు కృషి చేయాలన్నారు. డ్రాప్ అవుట్ శాతం తగ్గించాలని, అన్ని పాఠశాలల్లో వర్చువల్ క్లాసులు, డిజిటల్ క్లాసు రూంలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు 97 శాతం ప్రజలు సంతృప్తిస్థాయిలో వున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజిల్లో విద్యార్థుల నమోదు స్థాయిని పెంచాలన్నారు. డిగ్రీ కాలేజిల్లో మొదటి 6 లక్షల వ్యయంతో నిరుద్యోగ యువత వివిధ పోటీ పరీక్షల కొరకు మెటీరియల్ కొనుగోలు చేస్తామని, దీని ద్వారా మంచి ఫలితాలు సాధిస్తే మిగిలిన 4 లక్షలతో మెటీరియల్‌ను కొనుగోలు చేస్తామని తెలిపారు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు పైబర్‌నెట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

పర్యాటక కేంద్రంగా శిల్పారామం
* ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి
అనంతపురం కల్చరల్, అక్టోబర్ 23: నగర శివారులోని శిల్పారామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి పేర్కొన్నారు. మంగళవారం నగర మేయర్ స్వరూప, డిప్యూటీ మేయర్ గంపన్నలతో కలసి శిల్పారామంలో మోటార్ బోటింగ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదం, వినోదంతోపాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. శిల్పారామానికి తరలివచ్చే సందర్శకులకు ఫెడల్ బోటింగ్‌తోపాటు మోటార్ బోటింగ్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. రూ. 2.50 లక్షల ఖర్చుతో మోటార్ బోటింగ్‌ను ఏర్పాటుచేయడం జరిగిందని, మరో మూడు మోటార్ బోట్లను అందుబాటులోకి తేనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆర్డీటీ సహకారంతో రూ.1 కోటి ఖర్చుతో చెక్‌డ్యాంను నిర్మించడంతో నీరు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే శిల్పారామంలో పిల్లలతోపాటు పెద్దలకు వినోదం, ఆహ్లాదం కల్పించేందుకు అనేక సౌకర్యాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. మరిన్ని సౌకర్యాలతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకునేందుకు వీలుగా శిల్పారామంలో కల్యాణమండపం నిర్మించడం జరిగిందన్నారు.

పంచాయతీలను అభివృద్ధి చేయడంలో
ప్రత్యేక అధికారుల పాత్ర కీలకం
అనంతపురం సిటీ, అక్టోబర్ 23: గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడంలో ప్రత్యేక అధికారుల పాత్ర చాలా కీలకమని కలెక్టర్ జీ.వీరపాండ్యన్ పేర్కొన్నారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో డీపీఆర్‌సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందితే మండల, నియోజక, జిల్లా, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జిల్లాలో 1003 పంచాయతీలున్నాయని, ఆయా పంచాయతీలలో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పరిపాలనలో కొనసాగుతోందన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని గ్రామాల అభివృద్ధి చెందడానికి కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు లబ్దిదారులను చేరుతున్నాయో లేదో మీరే పర్యవేక్షించాలన్నారు. పంచాయతీలోని ఓటర్ల జాబితలో నమోదుకాబడిన వయోజనులందరూ గ్రామసభ నిర్వహణ, గ్రామసభ్యులేనని తెలిపారు. ప్రజలకు అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించే విధంగా ప్రత్యేక అధికారులు కృషి చేయాలన్నారు. పారిశుద్ధ్యంలో పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలన్నారు.