అనంతపురం

మోదీది ఆది నుంచి కుట్ర రాజకీయమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదిగుబ్బ, అక్టోబర్ 23: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆది నుండి కుట్ర రాజకీయాలతోనే ఆ స్థాయికి ఎదగారని హిందూపురం పార్లమెంట్ సభ్యులు నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు. మంగళవారం ఎంపీ నిమ్మల, ధర్మవరం ఎమ్మెల్యే గోనుకుంట సూర్యనారాయణలు గ్రామదర్శినికి హాజరై ఎనుములవారిపల్లిలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా దగా, కుట్ర రాజకీయాలతోనే అయ్యారని, అనంతరం అవే వంట పట్టించుకొని ప్రధాని స్థాయికి ఎదిగి, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తన కుట్ర, కుతంత్ర రాజకీయాలు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఏపీలో సైతం తన జగన్‌ను తన ఏజెంట్‌గా నియమించుకున్నాడని, అతను సైతం కేసులు కొట్టేయించుకొని నిజ స్వరూపాన్ని నిరూపిస్తారని బీజేపీ నాయకులకు సలహా ఇచ్చారు. అంతేగాక దేశంలోనే పెద్ద అవినీతిపరుడు మోదీనే అని, మోదీ భారత్‌కే ఓ కలంకమన్నారు. అందుకు నిదర్శనం నేడు సీబీఐలో జరుగుతున్న తీరేనని పేర్కొన్నారు. మోదీ లక్ష్యం టీడీపీని నియంత్రించడమే ధ్యేయంగా పెట్టుకొని అధికారులతో దాడులు చేయిస్తూ ఎదురు ప్రశ్నించిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌పై తన మార్కును ప్రదర్శిస్తున్నారన్నారు. సీబీఐలోనూ, కేంద్రంలోని కీలకస్థాయి అధికారులను గుజరాత్ వారినే నియమించుకొని అవినీతికి పాల్పడుతున్నారని, అందులో భాగమే సీబీఐలోని డైరెక్టర్ల తీరు వల్ల మనకు తెలుస్తోందన్నారు. ఇప్పటికైనా మోదీచే బీజేపీ నాయకులు రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సూరి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు గ్రామాలకు వెళ్తే వందల్లో సమస్యలపై అర్జీలు వచ్చేవని, నేడు అడుగడుగునా ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు వస్తున్నారని, ప్రజా సమస్యలు 95 శాతం తీర్చడం జరిగిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్, పవన్‌కు రాష్ట్రంలోని 13 జిల్లాలకుగాను 13 సీట్లు సాధించడం ఖాయమని పేర్కొన్నారు. దేశంలోనే నదుల అనుసంధానంతో చంద్రబాబు ఆదర్శమవడమేకాక రాష్ట్రంలో రైతులకు దేవుడయ్యారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు ఇవ్వడం జరుగుతోందని, వచ్చే ఐదేళ్లలో ఏపీలో 2 కోట్ల ఎకరాలకు నీరిచ్చే లక్ష్యంతో బాబు ముందుకెళ్తున్నారన్నారు.

మున్సిపల్ వైస్ చైర్మన్‌పై నేడు అవిశ్వాస తీర్మానం
* హాజరుకామంటున్న టీడీపీ కౌన్సిలర్లు..
కదిరి, అక్టోబర్ 23: కదిరి మున్సిపల్ వైస్ ఛైర్మన్ వసంతపై నేడు (బుధవారం) అవిశ్వాస తీర్మానం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఎన్నికల అధికారిగా కదిరి ఆర్డీఓ రామ్మోహన్ వ్యవహరిస్తున్నారు. కాగా టీడీపీ కౌన్సిలర్లు దాదాపు 18 మంది టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్‌ను ఆయన నివాసంలో మంగళవారం కలుసుకున్నారు. వైస్ ఛైర్మన్ అవిశ్వాస తీర్మాణానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కందికంటతో చర్చించారు. మెజార్టీ టీడీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి హాజరుకాకూడదని నిర్ణయించడంతో దాదాపు అవిశ్వాస తీర్మాణం వీగిపోయే అవకాశం ఉంది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ షేక్ సురియాభానుపై కూడా 25 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించడంతో మంగళవారం జరగాల్సిన అవిశ్వాస తీర్మానం కోర్టు స్టేతో వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో వైస్ ఛైర్మన్ అవిశ్వాసంపై టీడీపీకి చెందిన కౌన్సిలర్లకు మద్దతుగా వైకాపాకు చెందిన 9 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి హాజరుకాకూడదని నిర్ణయించడంతో దిక్కుతోచని స్థితిలో వైకాపా కౌన్సిలర్లు ఉన్నారని చెప్పుకోవచ్చు. అవిశ్వాసానికి హాజరైతే మెజార్టీ కౌన్సిలర్లు లేక అవిశ్వాసం వీగిపోతుందని, ఒకవేళ అవిశ్వాసానికి హాజరుకాకపోతే అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేసిన తమను ప్రజలు విశ్వసించరని వైకాపా కౌన్సిలర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.