క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శెట్టూరు, నవంబర్ 20 : మండల పరిధిలోని చిన్నంపల్లి గ్రామంలో ధనలక్ష్మి (35) విద్యుదాఘాతంతో మంగళవారం మృతి చెందింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు ఇంట్లో ఏర్పాటు చేసుకున్న 2హెచ్‌పీ మోటారుకు విద్యుత్ సరఫరా కావడంతో గమణించిన ధనలక్ష్మి పక్కన కూర్చొని ఉండగా షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రైతు ఆత్మహత్య
కంబదూరు, నవంబర్ 20 : మండల పరిదిలోని నూతిమడుగులో అప్పుల బాధ తాళలేక ఈడిగ గోవిందు (51) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు తెల్లవారుజామున వ్యవసాయ తోటకు వెళ్లిన గోవిందు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం తోటకు వెళ్లిన భార్య గమణించి వెంటనే బంధువులకు తెలిపింది. వారు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోవిందు తనకున్న ఐదెకరాల పొలంలో నాలుగు బోర్లు వేస్తే కేవలం ఒక బోరులో మాత్రమే నీరు పడింది. అయితే ఈమధ్యకాలంలో ఆ బోరులో కూడా నీరు రాకుండా పోయింది. ఈనేపథ్యంలో పెట్టన పంట కళ్లెదుటే ఎండటంతోపాటు చేసిన అప్పులు ఎలా తీర్చాలని మదనపడేవాడని భార్య వాపోయింది. ఈనేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నాడని విలపించింది. ఎస్‌ఐ రామయ్య కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గుర్తు తెలియని శవం లభ్యం
పెద్దవడుగూరు, నవంబర్ 20 : మండల పరిధిలోని వీరేపల్లి రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తిని చేతులు వెనక్కి కట్టి హత్య చేసి, కాల్చి వేసిన ఘటన మంగళవారం మండలంలో సంచలనం రేపింది. తెల్లవారుజామున స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందచేశారు. పోలీసులు శవానికి పంచనామా నిర్వహించారు. మృతుని వయస్సు దాదాపు 25 ఏళ్లు ఉండవచ్చని ఆచూకి తెలిసిన వారు పెద్దవడుగూరు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్సై రమేష్‌రెడ్డి కోరారు. మృతుని వివరాలు తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని సీఐ శ్రీనివాసులు సందర్శించారు.

బోరు లారీ కింద పడి వ్యక్తి మృతి
ఆత్మకూరు, నవంబర్ 20: మండల పరిధిలోని తలుపూరు గ్రామంలో ఒక రైతు పొలంలో బోరు వేయడానికి వెళ్లిన లారీ బోల్తాపడి ఛత్తీస్‌గడ్‌కు చెందిన సురేష్ (20) మంగళవారం మృత్యువాతపడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్గటనలో మరో నలుగురు గాయపడగా అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పొట్టకూటి కోసం ఛత్తీస్‌గడ్ నుంచి వచ్చి తలుపూరులో ప్రమాదానికి గురైనారు. ఎస్‌ఐ సాగర్ ప్రమాద స్థలిని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.