అనంతపురం

దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య క్షయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, మార్చి 24: దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద రోగాల జాబితాలో క్షయ ఆందోళన కలిగించే స్థాయిలో ఉందని, దీనిని నివారించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన విధానాలను తీసుకురావటం జరిగిందన్నారు. సామాజిక బాధ్యతతో వైద్య సిబ్బంది క్షయ వ్యాధికి అడ్డుకట్ట వేయాలని జాయింట్ కలెక్టర్-2 సుబ్బరాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అనిల్‌కుమార్ సంయుక్తంగా పిలుపునిచ్చారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రపంచ క్షయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసి-2 సుబ్బరాజు మాట్లాడుతూ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న రోగాల్లో క్షయ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటోందన్నారు. ఇది అంటువ్యాధి కావడం, సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల ద్వారా ఎదుటి వ్యక్తులకు సోకటం మూలంగా దీని ప్రభావానికి గురవుతున్నారన్నారు. కావున వ్యాధి సోకిన వ్యక్తులు కొన్ని ఆరోగ్య సూత్రాలు తప్పక పాటించాలన్నారు. ముఖ్యంగా ఆశా కార్యకర్తలు క్షయ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి ప్రాథమిక దశలోనే వైద్యం అందించగలిగితే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఆశా కార్యకర్తలు క్షయ వ్యాధి రోగులను గుర్తించి ఆసుపత్రికి తీసుకొస్తే రూ.500 అందజేయటం జరుగుతుందన్నారు. అనంతరం సర్వజన ఆసుపత్రిలో క్షయ వ్యాధి గ్రస్తులకు న్యూట్రీషియన్ ఫుడ్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ సుధీర్‌బాబు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఛాతి వ్యాధుల విభాగం అధికారి డాక్టర్ రామస్వామి, డాక్టర్లు పురుషోత్తం, సుజాత, రంగనాథ, అభిషేక్, దోసారెడ్డి, గంగాధర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలి
* ఆర్‌జేడీ నిర్మల
హిందూపురం టౌన్, మార్చి 24 : విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని కళాశాల ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నిర్మల పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవం ప్రిన్సిపాల్ డాక్టర్ శంకరయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక వ్యవస్థలో అభివృద్ధిని సాధించాలంటే ఎంతో మంది సహాయ సహకారాలు ఉండాలన్నారు. విద్యార్థినిలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంతర్జాల సదుపాయాలను వినియోగించుకోవాలన్నారు. ఇటీవల మృతి చెందిన ఖగోళ శాస్తవ్రేత్త స్టీఫెన్ హాకింగ్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయనకు అవయవాలు పనిచేయకున్నా ఆత్మ విశ్వాసంతో ప్రపంచానికి ఎన్నో పరిశోధనలు అందించారన్నారు. విద్యార్థినిలు ఒక లక్ష్యంతో విద్యాభ్యాసం సాగించాలన్నారు. ప్రిన్సిపాల్ శంకరయ్య మాట్లాడుతూ నాలుగేళ్లుగా కళాశాల అభివృద్ధికి ఎంతో మంది సహకారం అందిస్తున్నారన్నారు. కళాశాల అభివృద్ధికి సహకారం అందిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పీజీ ఎకనామిక్స్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను సన్మానించారు. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో రాణించిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అనంతపురం కెఎస్‌ఎన్ మహిళా డిగ్రీ కళాశాల, కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లు కల్యాణి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.