అనంతపురం

భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, మార్చి 24: హంద్రీనీవా 9వ ప్యాకేజీ కింద భూములు కోల్పోతున్న రైతులకు భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేఖరులతో రైతులు మాట్లాడారు. పుట్టపర్తి మండలంలోని పెద్దకమ్మవారిపల్లి గ్రామానికి చెందిన రైతులకు సంబంధించిన భూములు పుట్టపర్తి అర్బన్ పరిధిలోకి వర్తిస్తాయన్నారు. తమకు కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం కాకుండా పాత చట్టం ప్రకారం నోటీసులు జారీ చేశారని, దీనిపై తాము కోర్టును ఆశ్రయించామన్నారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టుకు వెళ్లగా సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును తప్పుపడుతూ నూతన చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చిందన్నారు. అయినప్పటికీ అధికారులు రైతుల పట్ల దౌర్జన్యానికి పాల్పడుతూ కాలువ పనులను బలవంతంగా చేపడుతున్నారన్నారు. తమ పక్కన గల భూములకు ఎకరానికి రూ. 1కోటి 60 లక్షలు చొప్పున పరిహారం చెల్లించారన్నారు. తమకు కనీసం ఎకరానికి రూ. 1కోటి చొప్పున చెల్లించాలని తాము కోరుతున్నామన్నారు. తమకు న్యాయం చేయాలని రైతులు పేర్కొంటున్నారు. ఈ సమావేశంలో రైతులు రామ్మోహన్, వెంకటనారాయణ, వెంకటరాముడు, కిష్టప్ప, నారాయణస్వామి, ప్రతాప్, ప్రకాష్, ప్రమీలమ్మ తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గం
అనంతపురం కల్చరల్, మార్చి 24: బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని కోటక్ మహీంద్రా బ్యాంకు ఎంప్లారుూస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కేజే.రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కోటక్ బ్యాంకు ఎంప్లారుూస్ యూనియన్ వజ్రోత్సవాలను నగరంలోని హోటల్ మాసినేని గ్రాండ్‌లో శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల్లో అనేక సంవత్సరాలుగా ఉద్యోగాల భర్తీ చేయకపోవడం వల్ల సభ్యుల సంఖ్య క్షీణించి బేరసారాల హక్కు కాలరాయబడుతోందన్నారు. ప్రభుత్వాలు, బ్యాంకు యాజమాన్యాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కాట్నేకాలువ అనాథాశ్రమానికి షెడ్డు నిర్మాణం కోసం లక్షన్నర రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నాగరాజు, చైర్మన్ క్రిష్ణ, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్, చౌదరి, చంద్రశేఖర్, మహేష్, రుష్యేంద్రబాబు, రఘునాథరెడ్డి, జయప్రకాష్‌రావ్, సుబ్బారెడ్డి, సీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధులు సంతృప్తినిస్తాయి
- ఎస్పీ అశోక్‌కుమార్
అనంతపురం అర్బన్, మార్చి 24: ప్రజలతో అనునిత్యం మమేకమై సేవలు అందించే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధుల్లో ఉన్న సంతృప్తి మిగతా విధుల్లో ఉండదని ఎస్పీ అశోక్‌కుమార్ అభిప్రాయపడ్డారు. శనివారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బందికి వేసవికాల నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా కళ్లద్దాలు, హెల్మెట్, ఓఆర్‌ఎస్ పాకెట్లు, రేడియం రిఫ్లెక్టింగ్ జాకెట్స్, వాటర్‌బాటిళ్లు తదితర ఉపకరణాలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వేసవికాలం నేపథ్యంలో ట్రాఫిక్ సిబ్బంది ఎండవేడిమితోపాటు వడదెబ్బకు గురికాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఉపకరణాలను అందజేయడం జరిగిందన్నారు. ట్రాఫిక్ విధులు చాలా కష్టంతో కూడుకొని ఉంటాయన్నారు. దుమ్ము, ధూళీ, వర్షం, శబ్ధ కాలుష్యం తదితర సమస్యలను తట్టుకొని విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. నగరంలో భారీగా ట్రాఫిక్ ఉందన్నారు. సంబంధిత పాయింట్లలో ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతే ఎదురయ్యే సమస్యలు వర్ణనాతీతం అన్నారు. అనారోగ్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శ్వాస సంబంధిత పరీక్షలు చేయించి సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడతామని తెలిపారు. ఎస్పీ చేతుల మీదుగా కళ్లద్దాలు, హెల్మెట్, వాటర్ బాటిల్స్ తదితర ఉపకరణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐలు నాగేంద్ర, నగేష్, సద్గురుడు, సతీష్, శేషగిరి, జయరాంనాయక్, రామాంజినేయులు సిబ్బంది పాల్గొన్నారు.