క్రైమ్/లీగల్

అంతర్ జిల్లా బైక్ దొంగల ముఠా పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, మార్చి 24: ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, రద్దీ ప్రాంతాలు, ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగలించే నలుగురు సభ్యులు గల అంతర్ జిల్లా ముఠాతోపాటు మరో ఇద్దరు రిసీవర్ల అంతర్ జిల్లా దొంగల ముఠాను మూడవ పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. నిందితుల నుంచి 84 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. వీటి విలువ రూ.45 లక్షలు ఉంటుందన్నారు. శనివారం ఇందుకు సంబంధించి స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ అశోక్‌కుమార్‌తోపాటు డీఎస్పీ వెంకటరావు, సీఐ మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల దొంగతనంలో ప్రధాన నిందితుడు బండారు కృష్ణ అన్నారు. ఆరు నెలల క్రితం ద్విచక్ర వాహనాల దొంగతనంకు సంబంధించి పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయటం జరిగిందన్నారు. బండారు కృష్ణ అమాయక యువకులను సమీకరించి ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడటం రివాజుగా మార్చుకోవటం జరిగిందన్నారు. దొంగతనం చేసిన వాహనాలను తక్కువ ధరకే అమ్మడం, జల్సాలు చేయటం అలవాటుగా మార్చుకొన్నాడన్నారు.
నిందితుల వివరాలు : బండారు కృష్ణ పెద్దవడుగూరు మండలం, చిన్నవడుగూరు గ్రామం, వడ్డే నారాయణస్వామి అలియాస్ ఎర్రోడు యాడికి మండల కేంద్రం, వంకం నాగరాజు యాడికి మండలం, దుద్దే శివకుమార్ యాడికి మండల కేంద్రం
అరెస్టు అయిన రీసీవర్లు : కోడూరు బాలకృష్ణారెడ్డి, యాడికి మండల కేంద్రం, దూదేకుల గౌస్ యాడికి మండల కేంద్రం
ద్విచక్ర వాహనాలు దొంగలించిన ప్రాంతాలు ఇవే : ఓ ముఠాగా ఏర్పడిన వీరు చిత్తూరు జిల్లా మదనపల్లి, కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, కర్నూలు, డోన్, అనంతపురం జిల్లాలోని గుత్తి, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, రాప్తాడు తదితర ప్రాంతాల్లో నకిలీ తాళాలతో ద్విచక్ర వాహనాలను చోరీ చేయటం పరిపాటిగా మార్చుకోవటం జరిగిందన్నారు.
యాడికి కేంద్రంగా చోరీ వాహనాల అమ్మకాలు : నిందితులు వివిధ జిల్లాలో అపహరించిన 84 ద్విచక్ర వాహనాలు యాడికి కేంద్రంగా తక్కువ ధరకే అమ్మటం జరిగిందన్నారు. సూమారు రూ. 2లక్షల విలువ చేసే స్పోర్ట్స్ బైక్ సైతం ఇందులో ఉందన్నారు. చోరీ చేసిన వాహనాలను కేవలం రూ.5వేలకు సైతం అమ్మటం జరిగిందన్నారు. వచ్చిన డబ్బును జల్సాలకు ఖర్చు చేయటం జరిగిందన్నారు.
అరెస్టు ఇలా : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు వరసగా చోరీకి గురవుతండటంతో అనంతపురం డీఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలో మూడవ పట్టణ సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐలు క్రాంతికుమార్, నారాయణరెడ్డి, శంకర్‌రెడ్డితోపాటు హెడ్ కానిస్టేబుల్ బాబునాయక్, రాజు, బాలకృష్ణ, కానిస్టేబుళ్లు జాఫర్, ఫిరోజ్, తిరుమలేశ్, హరి, భార్గవతో కలిసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి ద్విచక్ర వాహనాల దొంగలపై నిఘా ఉంచటం జరిగిందన్నారు. శుక్రవారం పక్కా సమాచారంతో స్థానిక తపోవనం కూడలిలో ఈ ముఠాను అరెస్టు చేయటం జరిగిందన్నారు. రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగలించిన అంతర్ జిల్లా ముఠాను అరెస్టు చేయడంలో కీలక పాత్ర వహించిన త్రీ టౌన్ పోలీస్ సిబ్బందికి ఎస్పీ ప్రశంసించారు.