అనంతపురం

లేపాక్షి వైభవాన్ని దశదిశలా చాటుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, మార్చి 24 : శిల్పకళల కాణాచిగా పేరుగాంచిన లేపాక్షి నంది ఉత్సవాలను దశదిశలా చాటి చెప్పే విధంగా నిర్వహిస్తామని మంత్రి కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. శనివారం సాయంత్రం బెంగళూరు నగరంలోని జెడబ్ల్యు మారియట్ హోటల్‌లో లేపాక్షి ఉత్సవాల సన్నాహక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా ఉత్సవాల లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లేపాక్షి వైభవం, ప్రాశస్త్యాన్ని చాటడానికి ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచం మెచ్చిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ దివంగత నందమూరి తారక రామారావుకు వారసుడిగా, హిందూపురం ఎమ్మెల్యేగా లేపాక్షి ఉత్సవాల స్ఫూర్తిదాత నందమూరి బాలకృష్ణ అని కొనియాడారు. అత్యంత వెనుకబడిన హిందూపురం నియోజకవర్గానికి 1995వ సంవత్సరంలో ఎన్టీ రామారావు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి అన్నివిధాల అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఎన్టీఆర్ తరహాలోనే తనయుడు బాలకృష్ణ ఎమ్మెల్యేగా హిందూపురం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ కలలను నెరవేర్చే నిమిత్తం కృష్ణాజలాలను హంద్రీనీవా పథకం ద్వారా లేపాక్షి ఉత్సవాల నాటికి చెరువుల్లోకి నీరు నింపేందుకు బాలకృష్ణ కృషి ఆదర్శప్రాయమన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ 2016లో లేపాక్షి ఉత్సవాలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించామన్నారు. అయితే 2017లో తాగునీటిని హిందూపురం ప్రాంతానికి వచ్చిన తర్వాతే నిర్వహించాలని ప్రయత్నించగా సాంకేతిక పరమైన కారణాల వల్ల సాధ్యం కాలేదన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ మానసిక పుత్రికలైన తెలుగుగంగ, గాలేరు - నగరి, హంద్రీనీవా పథకాలు ద్వారా రాయలసీమకు కృష్ణాజలాలను అందించి సస్యశ్యామలం చేయాలనే కల నేరవేరుతోందన్నారు. 108 శైవక్షేత్రాల్లో లేపాక్షి దుర్గాలయాన్ని ఎంతో కీర్తి ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈనెల 31, ఏప్రిల్ 1వ తేదీల్లో నిర్వహించనున్న లేపాక్షి ఉత్సవాలను తెలుగు వైభవాన్ని చాటి చెప్పే విధంగా నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల ప్రారంభం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి లేపాక్షి చెరువులో కృష్ణాజలాలకు హారతి ఇస్తారన్నారు. కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ లేపాక్షికి ఉన్న ఘనమైన సంస్కృతి, సంప్రదాయాలు రాష్ట్రానికే పరిమితం కాదని, కర్నాటక రాష్ట్రంతో కూడా ముడిపడి ఉన్నందున రోడ్‌షో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. లేపాక్షి ఉత్సవాల సందర్భంగా ప్రముఖ వాయిద్య కళాకారుడు శివమణి డ్రమ్స్, రవిచారి సితార ప్రదర్శన, అచ్యుత మానస కూచిపూడి నృత్యం వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 500 మంది కళాకారులచే మహా కూచిపూడి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో ప్రత్యేక రూపకం, శోభాయాత్ర, జానపద కళా ప్రదర్శన, హస్తకళల ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. అంతుకు మునుపు ఉత్సవాల ప్రమోషనల్ వీడియోను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించగా ప్రత్యేకంగా ఉత్సవాల కోసం రూపొందించిన పాటను మంత్రి కాలువ ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్‌మోద్దీన్, పర్యాటకశాఖ ఆర్డీ గోపాల్, డీఆర్‌డీఏ పీడీ రామారావు, ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, సమాచార శాఖ ఏడీ జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామనవమి వేడుకలకు బాలయ్య రాక
హిందూపురం టౌన్, మార్చి 24 : ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శ్రీరామనవమి వేడుకలతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం రాన్నట్లు వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 గంటలకు నంది ఉత్సవాల్లో భాగంగా చిలమత్తూరు మండల పరిధిలోని కొడికొండ వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తారన్నారు. అదేవిధంగా 11.30 గంటలకు లేపాక్షి జ్యోతిరావుపూలే బీసీ రెసిడెన్షీయల్ పాఠశాలలో ఉత్సవాల బెలూన్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. అలాగే పట్టణంలోని మేళాపురంలో సాయంత్రం 4.30 గంటలకు చంద్రన్న విలేజ్ మాల్‌ను ప్రారంభించి 5.30 గంటలకు సూగూరు ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో జరిగే లంకాదహన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.