అనంతపురం

అకాల వర్షంతో భారీ నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్యాణదుర్గం, ఏప్రిల్ 20 : నియోజకవర్గంలో గురువారం రాత్రి కురిసన అకాల వర్షంతో భారీగా పంట నష్టం సంభవించింది. నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి మండలాల్లో సాగు చేసిన మామిడితోపాటు, వరి, అరటి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. మంగలకుంటలో శ్రీరాములుకు చెందిన 10 ఎకరాల అరటి పంట దెబ్బతింది. దీంతో సుమారు రూ.10 లక్షల వరకూ నష్టం సంభవించింది. నరసాపురంలో వడగండ్ల వర్షం కురవడంతో వరి పంట దెబ్బతింది. పాలవెంకటాపురం, రామచంద్రాపురం, మామడూరు, బసంపల్లి, శెట్టూరు తదితర గ్రామాల్లో మామిడి, వరి తదితర పంటలు నష్టపోయాయి. కాగా కళ్యాణదుర్గంలోని సాయిబాబా దేవాలయం పక్కన ఉన్న డ్రైనేజీ నిండిపోయి సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరింది. మురిగినీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాతబస్టాండులో మోకాళ్లలోతు నీరు చేరడంతో వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కల్గింది. వెంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన చలువ పండిల్లు ఎరిగిపోయాయి. కరెంటు లేకపోవడంతో ప్రజలు రాత్రి నిద్రలేక తీవ్ర ఇబ్బంది పడ్డారు.

బెళుగుప్పలో...
బెళుగుప్ప : ఆరుగాలం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంటలు గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ వీచిన బలమైన ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురవడంతో చేతికొచ్చిన పంట నేలపాలైంది. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, నరసాపురం, రామసాగరం, దుద్దేకుంట గ్రామాల్లో ఈదురుగాలులతోపాటు వడగండ్ల వాన కురవడంతో వరి, అరటి, కర్భూజ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నరసాపురం గ్రామానికి చెందిన మారెప్ప, రుద్రప్ప, నాగభూషణ, చిన్న పోతన్న, బ్రాహ్మణపల్లికి చెందిన రైతులు తిప్పేస్వామి, ఎర్రిస్వామి సాగు చేసిన వరిపంట, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. రామసాగరానికి చెందిన మహిళా రైతులు అపర్ణ, నాగరత్నమ్మ, దుద్దేకుంటకు చెందిన రైతు హనుమంతరాయుడు, జీడిపల్లికి చెందిన రైతులు ఎర్రిస్వామి, ఆంజనేయ, జయన్న, ధనుంజయ, వన్నూరుస్వామి, కాలువపల్లికి చెందిన రైతులు లీలమ్మ, శ్రీనివాసులు, అంకంపల్లికి చెందిన రైతులు ఉమామహేశ్వరనాయుడు సాగు చేసిన అరటి పంటలు నేలకొరిగాయి. దీంతో మండలవ్యాప్తంగా రూ.లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది. విషయం తెలుసుకున్న ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, ఆర్‌ఐలు జగన్నాథ్, భాగ్యమ్మ, వీఆర్వో రమేష్, వ్యవసాయాధికారి పృథ్వీసాగర్, ఉద్యానవన శాఖ అధికారి ధనుంజయ శుక్రవారం దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టంపై నివేదికలను ప్రభుత్వానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు.

వేర్వేరు ప్రాంతాల్లో చోరీ
గుత్తి, ఏప్రిల్ 20 : మున్సిపాలిటీ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం రాత్రి రెండిళ్లలో చోరీలు జరిగాయి. ప్రభుత్వాసుపత్రి సమీపంలోని రాచయ్యకు చెందిన నిత్యావసర వస్తువుల దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటనలో దుకాణంలో భద్రపరిచిన రూ.15వేలు, రూ.8వేలు విలువజేసే సిగరెట్ ప్యాకెట్లు అపహరించుకుపోయారు. అదేవిధంగా గుత్తి ఆర్‌ఎస్‌లోని రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉండే రమేష్ ఇంట్లో చొరబడి 2 తులాల బంగారు నగలు, 2 ఉంగరాలు, నగదును అపహరించుకుపోయారు. ఈ ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు.