క్రైమ్/లీగల్

గంగవరంలో పేకాటరాయుళ్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రూ.95,700ల నగదు స్వాధీనం
బెళుగుప్ప, మే 14: మండలంలోని గంగవరం గ్రామంలో ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేసి పది మందిని అరెస్టు చేశారు. ఎస్‌ఐ నాగస్వామి ఆందించిన వివరాల మేరకు గంగవరంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి పదిమందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ. 95,700ల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టు చేసిన వారిని సోమవారం కళ్యాణదుర్గం కోర్టుకు హాజరుపర్చామని ఎస్‌ఐ తెలిపారు.

జూదరులు అరెస్టు
గుడిబండ, మే 14: మండల పరిధిలోని రాళ్ళపల్లిలో జూదం ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై శరత్‌చంద్ర తెలిపారు. జూదం ఆడుతున్నట్లు అందిన సమాచారంతో ఆకస్మిక దాడులు నిర్వహించి జూదరులను అదుపులోకి తీసుకొని వారి నుండి రూ.16,840 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. కాగా గుడిబండలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న అశోక్‌ని అరెస్టు చేసి 9 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన
ఏపీఓ నాగమణి నేత్రాలు దానం
అనంతపురం అర్బన్, మే 14: కూడేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థలో ఏపీఓగా పనిచేస్తున్న నాగమణి (45) సోమవారం అరవకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. సాయి సంస్థల బృందం అక్కడికి చేరుకొని మృతి చెందిన నాగమణి వివరాలను వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఒప్పించి రెండు నేత్రాలను సేకరించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జ్యోతిబసు, ఏపీడీ నరసింహారెడ్డి, సాయి సంస్థ అధ్యక్షుడు విజయసాయి కుమార్ చేతుల మీదుగా వారి భర్త, తండ్రికి ప్రశాంసపత్రాన్ని అందజేశారు.