క్రైమ్/లీగల్

పేలుడు పదార్థాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాండ్లపెంట, మే 17: అనుమతి లేని పేలుడు పదార్థాలు శ్రీలక్ష్మినరసింహ క్వారీలో వుండగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు గొడ్డువెలుగల పంచాయతీలో క్వారీలో రాళ్లు పేల్చేందుకు వినియోగిస్తున్న తూటాలు, నల్లమందును గురువారం తమ సిబ్బందితో వెళ్లి స్వాధీనం చేసుకున్నామన్నారు. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకొని నిందితులు కుప్పుస్వామి, హరిలపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. ఈ దాడుల్లో పోలీసులు పామన్న, రంజీత్, చెన్నకేశవులు, వెంకటేష్ పాల్గొన్నారు.

క్రికెట్ బెట్టింగ్‌రాయుళ్లు అరెస్టు
* రూ.52 వేలు స్వాధీనం
నంబులపూలకుంట, మే 17: క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 12 యువకులను అరెస్టు చేసి వారి నుంచి రూ.52 వేలు స్వాధీనం చేసుకున్నట్లు గురువారం ఎస్సై రమేష్‌బాబు పేర్కొన్నారు. పట్టుబడిన నిందితులను శుక్రవారం కోర్టుకు హాజరుపరచడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.

కార్డెన్ సెర్చిలో 31 వాహనాలు సీజ్
గోరంట్ల, మే 17: గోరంట్ల రాజీవ్ కాలనీలో గురువారం కార్డెన్ సెర్చి నిర్వహించగా సరైన పత్రాలు లేని 31 మోటార్ బైక్‌లను సీజ్ చేసినట్లు ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు. ధర్మవరం డీఎస్పీ రామశర్మ ఆదేశాల మేరకు సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో పుట్టపర్తి, కొత్తచెరువు ఎస్సైలు శాంతిలాల్, రాజేష్‌లతోపాటు 40 మంది కానిస్టేబుళ్ళతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. వాహనాలతోపాటు పలు గృహాల్లో మారణాయుధాలు, గంజాయి వాటిపై తనిఖీలు చేశామన్నారు.
జూదరులు అరెస్టు
మండల పరిధిలోని మర్రిరెడ్డిపల్లి రహదారి పక్కన తోటలో జూదం ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి రూ.15,600 నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు. తోటలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడి చేసి పట్టుకొని రిమాండ్‌కు పంపామన్నారు.

పార్థి గ్యాంగ్ దొంగలుగా భావించి
అమాయకులకు దేహశుద్ధి
గోరంట్ల, మే 17: పార్థి దొంగల ముఠా మండల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోందంటూ వదంతులు వ్యాపించిన నేపథ్యంలో బుధవారం రాత్రి ముగ్గురు వ్యక్తులను పార్థి దొంగల ముఠాగా భావించి దేహశుద్ధి చేసిన సంఘటన చోటు చేసుకొంది. మండల పరిధిలోని పులేరు వద్ద గుడిసెలు వేసుకొని జీవిస్తున్న సంచార జాతికి చెందిన శివ, గంగరాజు, శివ భార్య గంగమ్మ బుధవారం రాత్రి ఎలుకలను పట్టుకోవడానికి శిరగంవాండ్లపల్లి వద్ద గల పొలాల్లోకి వెళ్లారు. అదే సమయంలో గోరంట్ల నుండి మోటారు బైక్‌లో వస్తున్న ఓ యువకుడు వీరిని దొంగలుగా భావించి గ్రామంలోకి వెళ్ళి చెప్పాడు. దీంతో గ్రామస్థులు కట్టెలు తీసుకొని పొలం వద్దకు చేరుకొని దాడి చేసి తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో సంచారజాతికి చెందిన వ్యక్తులుగా తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మండల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి దొంగల ముఠాలు సంచరించడం లేదని, పుకార్లు నమ్మవద్దని ఎస్సై సుధాకర్ యాదవ్ ప్రజలకు తెలిపారు.

చోరీ కేసు నిందితుల అరెస్ట్
*4 తులాల బంగారు చైన్‌లు స్వాధీనం
గుంతకల్లు, మే 17: పట్టణంలోని హనుమేష్ నగర్‌లో నాగరాజు ఇంట్లో చోరీ కేసులో ఇద్దరు నిందితులను గురువారం అరెస్ట్ చేసినట్లు అర్బన్ సీఐ రాజా తెలిపారు. స్థానిక అర్బన్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సీఐ రాజా మాట్లాడుతూ గత నెలలో హనుమేష్ నగర్‌లో నివాసం వుంటున్న నాగరాజు ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా చొరబడిన బోయ ప్రేమ్‌కుమార్, బోయ రుద్రలు ఇంట్లోని బీరువాలో దాచి వుంచిన నాలుగు తులాల కలిగిన అయ్యప్ప స్వామి డాలన్ కలిగిన డాలర్, బంగారు చైన్‌లు మూడు అపహరించారన్నారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్సై వెంకటప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే గురువారం మధ్యాహ్నం పట్టణానికి చెందిన పాత నేరస్థులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులను విచారించారన్నారు. వారి వద్ద గల బంగారు చైన్‌లు, ఆయ్యప్ప స్వామి డాలర్ కలిగిన బంగారు డాలర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని, వన్‌టౌన్ ఎస్సై వెంకటప్రసాద్‌ను సీఐ అభినందించారు.

బైకు- అంబులెన్స్ ఢీ .... ఒకరికి తీవ్ర గాయాలు
ధర్మవరం, మే 17: పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయ సమీపంలో ఫ్లైఓవర్‌పై బైకు - అంబులెన్స్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన వివరాలు ఇలా వున్నాయి. పట్టణానికి చెందిన మంజునాథ్ పోతుకుంట వైపు నుంచి ద్విచక్ర వాహనంలో పట్టణంలోకి వస్తుండగా పట్టణం నుంచి మామిళ్ళపల్లి వైపు వెళ్తున్న ప్రైవేటు ఆంబులెన్స్ ఫ్లైఓవర్‌పై వున్న మలుపు వద్ద బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో మంజునాథ్ తీవ్రంగా గాయపడడంతో స్థానికులు ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మంజునాథ్‌ను అనంతపురంకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి,
మరొకరికి తీవ్ర గాయాలు
రాప్తాడు, మే 17 : మండల పరిధిలోని మరూరు గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై గురువారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో మరూరు గ్రామానికి చెందిన కరుణ (22) మృతి చెందగా, కదిరికి చెందిన ఆంజనేయులు తీవ్ర గాయాలకు గురయ్యాడు. రాప్తాడు ఎస్‌ఐ ధరణిబాబు తెలిపిన వివరాల మేరకు మరూరు గ్రామానికి చెందిన ఓబిళేసు, పార్వతిల చిన్నకుమారుడు కరుణ టిప్పర్ డ్రైవర్‌గా వెళుతూ జీవనం సాగించేవాడని, గురువారం అతని మిత్రుడు ఆంజనేయులుతో కలిసి మరూరు గ్రామం నుండి ద్విచక్ర వాహనంలో ధర్మవరంకు వెళుతుండగా జాతీయ రహదారి రోడ్డు దాటుతుండగా పెనుకొండ నుంచి ధర్మవరం వెళ్లేందుకు లారీ వస్తుండగా మరూరు జక్షన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరుణ అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన ఆంజనేయులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడం వలన ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, వెంటనే స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. పోలీసులు జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొనడంతో ధర్నా విరమించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

ఆంజినేయస్వామి గుడిలో చోరీ
ఓబుళదేవరచెరువు, మే 17: స్థానిక అభయ ఆంజినేయస్వామి గుడిలో బుధవారం అర్థరాత్రి చోరీ జరిగినట్లు ఆలయ పూజారి తోయరాజు స్థానిక పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. పూజారి తెలిపిన వివరాల మేరకు.. గుర్తుతెలియని దండుగులు ఆలయ ప్రధాన తలుపులుకు వేసిన తాళాన్ని పగులగొట్టి ఆలయం లోపల వున్న హుండీని పక్కనే వున్న పొలాల్లోకి తీసుకెళ్లి పగులగొట్టి అందులో రూ. 15 వేలకు పైగా నగదు, వెండి తీసుకెళ్లినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

హత్య కేసు ఛేదించిన పోలీసులు
బొమ్మనహాళ్, మే 17: మండల పరిధిలోని తారకాపురం గ్రామానికి చెందిన చాకలి వన్నూర్‌స్వామి(32)ని కర్నాటకలోని బుర్నాకనహళ్లి గ్రామ సమీపంలో ముగ్గురు వ్యక్తులు కలసి హత్య చేసినట్లు రాయదుర్గం సీఐ చలపతిరావు పేర్కొన్నారు. వారిచ్చిన సమాచారం మేరకు వన్నూర్‌స్వామి భార్య చిట్టెమ్మ 15.04.2018న చాకలి వన్నూర్‌స్వామి కనబడుట లేదని పోలీసులుకు ఫిర్యాదు చేశారు. బొమ్మనహాల్ ఎస్‌ఐ నాగమధు కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగా తారకాపురం గ్రామానికి చెందిన కుమారస్వామిపై అనుమానాస్పదంగా కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు అతని ఫోన్‌కాల్స్‌ను పరిశీలించి కుమారస్వామిని విచారించగా అతనితోపాటు వెంకటేశులు, బాలాజి ఆలియాస్ వన్నూర్‌స్వామి వీరు ముగ్గురు కలసి ఏప్రిల్ 13వ తేదీన బుర్నాకనహళ్లి గ్రామ సమీపంలో వన్నూర్‌స్వామిని కుమారస్వామి ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లి వేటకొడవళ్లతో నరికి హత్య చేసినట్లు వారు పేర్కొన్నారు. హత్యకు గురయిన వన్నూర్‌స్వామి గత 10 సంవత్సరాల నుండి రసాయన ఎరువుల అంగడి, సీడ్ విత్తనాల వ్యాపారం, ఎండు మిరపకాయల వ్యాపారం చేసేవాడని అతని ఎదుగుదలను ఓర్వలేక చాకలి వన్నూర్‌స్వామికి గతంలో జరిగిన కొన్ని సంఘటనలు దృష్టిలో ఉంచుకుని హత్యకు పాల్పడినట్లు తలారి కుమారస్వామి పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.

రుణాలు ఇప్పిస్తానంటూ బురిడీకి యత్నం
* పోలీసుల అదుపులో మహిళ
హిందూపురం టౌన్, మే 17: ప్రజల అమాయకత్వం, అత్యాశ, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకున్న కొందరు వివిధ రకాలుగా మోసం చేస్తూ లక్షలకు లక్షలు సొమ్ము చేసుకొని ఉడాయించిన సంఘటనలు అనేకంగా ఉన్నాయి. అదే తరహాలో బ్యాంకుల్లో రుణాలను ఇప్పిస్తానని చెబుతూ కర్నాటక రాష్ట్రం గౌరిబిదనూరుకు చెందిన నాగమణి అనే మహిళ ప్రజలను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించగా అంతలోనే అప్రమత్తమైన బాధితులకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గౌరిబిదనూరుకు చెందిన నాగమణి పట్టణంలోని కొల్లకుంట ఇందిరమ్మ కాలనీ, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో బ్యాంకుల్లో రుణాలు ఇప్పిస్తానని, లక్ష రూపాయల రుణం కోసం రూ.3 వేల దాకా ఖర్చు అవుతుందని, ఆ నగదు చెల్లిస్తే వెంటనే తాను రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేస్తానని నమ్మిబలికింది. దీంతో కొందరు ఆమె మాయమాటలను నమ్మి రూ.3 వేల వంతున ఆమెకు చెల్లించారు. డబ్బులు చెల్లించిన కొందరు నాగమణిపై రుణాల కోసం ఒత్తిళ్లు చేయడంతో ఒకరిద్దరికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చెక్‌పై 90వ తేదీ, 50వ నెల 2018 సంవత్సరానికి రూ.24 వేల చెక్కును అందచేసింది. ఆ చెక్కు అందుకున్న మహిళలు మొదట్లో చూసుకోలేదు. అయితే గురువారం ఆ చెక్కును కుటుంబ సభ్యులకు చూపించడంతో అందులో పొంతన లేని విధంగా తేదీ, నెల ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పట్టణంలోనే ఉన్న ఆమెను వన్‌టౌన్ సీఐ చిన్న గోవిందు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకొని విచారించారు. ఇలా రుణాలు ఇప్పిస్తానని నగదు తీసుకున్న మహిళ పోలీసుల అదుపులో ఉందన్న సమాచారంతో డబ్బులు చెల్లించిన బాధితులు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు చేరుకొని లబోదిబోమన్నారు. దీనిపై సీఐ స్పందిస్తూ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నాగమణిని విచారిస్తున్నామని, పూర్తి వివరాలు తెలుసుకొని బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకొంటామని చెప్పారు.