అనంతపురం

యువత బెట్టింగ్‌తో బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, మే 17: ఎంతో భవిష్యత్తు వున్న యువత బెట్టింగ్‌లు ఆడుతూ ఆర్థికంగా నష్టపోయి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి, కదిరి రూరల్ సీఐ మన్సూరుద్దీన్‌లు కోరారు. బెట్టింగ్ ఆడుతున్న వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ. 5.11 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏప్రిల్ 22న బెట్టింగ్‌రాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ. 4.50 లక్షలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని వారు గుర్తుచేస్తూ ఈ కేసుకే సంబంధించి నాగేంద్ర, మహేష్, మనోహర్, శ్రీనివాసులు, రమణ నాయుడు, ఆంజినేయులును అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వీరిలో ప్రధాన ముద్దాయి అనుగొంది రాజాను కూడా వీరితోపాటు అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. క్రికెట్ బెట్టింగ్‌ను అరికట్టేందుకు రూరల్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో తలుపుల ఎస్‌ఐ చంద్రశేఖర్, గాండ్లపెంట ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి, ఎన్.పీకుంట ఎస్‌ఐ రమేష్‌బాబులను ఒక ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసి బెట్టింగ్‌రాయుళ్ల కోసం ఆరాతీయడం జరిగిందన్నారు. బట్రేపల్లి వద్ద వున్న ఓ రైస్‌మిల్‌లో ప్రధాన ముద్దాయి రాజా ఉన్నాడని సమాచారం అందుకొని అదుపులోకి తీసుకొని విచారించగా, రాజా తన తప్పును ఒప్పుకొని తనతోపాటు హర్షతో కలిసి బుకీలుగా వ్యవహరిస్తూ బెట్టింగ్ ఆడుతూ పట్టుబడిన వారితో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఒప్పుకోవడం జరిగిందన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ప్రధాన ముద్దాయి హర్ష పరారీలో ఉన్నాడని, త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు.

పడవ ప్రమాదంలో మరణించిన వారికి
25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
అనంతపురం సిటీ, మే 17: గోదావరి పడవ ప్రమాదంలో మృతి చెందిన మృతులకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో పడవ ప్రమాదంపై ప్రగాఢ సానుభూతి తెలిపుతూ, మృతులకు ఆత్మశాంతి కలగాలని వౌనం పాటించారు. అనంతరం విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తరచుగా పడవ ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పడవ లైసెన్సులను రెన్యువల్ చేస్తూ ముందుకు పోతుండడం చాలా దారుణమన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతవహించాలని డిమాండ్ చేశారు. దేశంలో భాజాపా నరేంద్రమోదీ నాయకత్వంలో జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసిందని, అందుకు జిల్లా శాఖ తరుపున మోదీకీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిజేస్తున్నామన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తూ విశ్వవిద్యాలయ నిర్మాణానికి సహకరించాల్సిందిగా కోరారు. అలాగే కర్ణాటక ఎన్నికలో బీజేపీ అతి పెద్ద పార్టీగా ఏర్పడుటకు సహకరించిన ఓటర్లుకు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. రాష్ట్ర భాజపా నూతన అధ్యక్షులుగా నియమించిబడిన కన్నా లక్ష్మినారాయణ ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పార్టీని ముందుకు నడిపంచడానికి, వారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. 2019 ఎన్నికల్లో జరుగు సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు తీసిపోని విధంగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా పార్టీ ఎదుగుతుందన్నారు.