అనంతపురం

గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కణేకల్లు, మే 17: పూర్తిగా వెనుకబడిన గ్రామాలలోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయంగా ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్‌తో నియోజకవర్గం క్రికెట్ పోటీలు కాలవ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు గ్రామీణ గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో గురువారం క్రికెట్ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పూర్తి వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి మండల స్థాయిలో ముందస్తుగా క్రీడలు ఆడించి అనంతరం నియోజకవర్గం స్థాయిలో ఆడిస్తామన్నారు. అక్కడి నుండి క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు క్రీడాకారులు ఎదిగే అవకాశం ఉందన్నారు. ఈ క్రీడా పోటీలకు దాదాపు 125 జట్లు పేర్లు నమోదు చేసుకున్నాయన్నారు. మండలాల్లో గెలుపొందిన జట్లును నియోజకవర్గ స్థాయిలో 28వ తేదీన రాయదుర్గంలో నిర్వహించే క్రికెట్ క్రీడల్లో పాల్గొంటాయన్నారు. ఈ క్రీడలు తన కుమారుడు భరత్ పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. అంతకుముందు భరత్ పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ను కోసి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. జిల్లాకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్శిటీ అందించడంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో ఒక్కటైన సెంట్రల్ యూనివర్శిటీ ఎప్పుడో మంజూరు కావాల్సి ఉండేదని, అయితే కేంద్రం ఆలస్యంగా మంజూరు చేసిందన్నారు. గతంలోనే అందించి ఉంటే ఇప్పటికి విద్యార్థులు అక్కడ చదువుకునే వారన్నారు. ఏది ఏమైనప్పటికి ఈ బడ్జెట్‌లోనే సెంట్రల్ యూనివర్శిటీకి అత్యధిక నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో నూతనంగా 65 లక్షలతో నిర్మించిన పౌర సరఫరాల గోదాంను ప్రారంభించారు. అనంతరం ఇంకుడు గుంతకు కంకర, ఇసుకను వేసి ప్రారంభించారు.

ప్రమాదాల నివారణకు కృషి చేస్తాం
*రహదారి భద్రతను పెంపొందిస్తాం
*ఎస్పీ అశోక్‌కుమార్
తాడిపత్రి, మే 17: జిల్లాలో రహదారులలో జరుగుతున్న ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని, రహదారి భద్రతను పెంపొందిస్తామని ఎస్పీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో స్వర్శ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మహిళల ఉచిత లైసెన్స్ మేళాను ఎస్పీ అశోక్‌కుమార్ ప్రారంభించారు. అనంతరం ప్రతి ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్‌ను ధరించాలని పేర్కొంటు ఎస్పీ హెల్మెట్‌ను ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్పీ అశోక్‌కుమార్ ప్రసంగిస్తూ స్వర్శ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏర్పాటుచేసిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా రాష్ట్రంలోనే కాదని, దేశంలోనే మొదటిసారియని అభివర్ణించారు. పాత రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ప్రొసిజర్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువమంది లైసెన్స్‌లు తీసుకునే వారు కాదని, నేడు లైసెన్స్ పక్రియ సులభతరం అయిందని, ప్రతి వాహనదారుడు లైసెన్స్ తీసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులకు రోడ్డు భద్రత, లైసెన్స్‌ల పట్ల అవగాహన ఉండటం లేదని, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై మాత్రమే దృష్టి సారిస్తున్నారని, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రోడ్డు భద్రతపై దృష్టి సారించి ఉచితంగా లైసెన్స్‌ల పంపిణీ చేపట్టడంతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు. వాహనదారుడు లైసెన్స్‌లు కలిగి ఉండటంతో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అమలు జరుగుతుందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు లైసెన్స్‌లు లేకపోతే ప్రమాద బీమా వర్తించదన్నారు. జిల్లాలో సంవత్సర కాలంలో వివిధ కారణాలతో 100 హత్యలు జరిగాయని, రోడ్డు ప్రమాదాల్లో 600మంది దుర్మరణం పాలైనారని, 2వేల మంది గాయపడ్డారని తెలిపారు. సుప్రీం కోర్టు గైడ్‌లెన్స్‌తో 15 శాతం రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టామని, రహదారి భద్రతను పెంపొందించామని, రహదారులలో ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామని తెలిపారు. అతివేగం ప్రమాదకరమని, ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ వాడకం తప్పనిసరియని, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణించ వద్దని తెలిపారు. జిల్లా ఉప రవాణా కమిషనర్ సుందర్ వద్ది ప్రసంగిస్తూ మహిళలు భారీ సంఖ్యలో లైసెన్స్‌లకై ముందుకు రావడం సంతోషకరమన్నారు. శాసన సభ్యులు జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రసంగిస్తూ రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని, విధిగా పాటించాలన్నారు. స్వర్శ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తాడిపత్రిలో 680మంది మహిళలకు లైసెన్స్‌లు అందజేస్తున్నామంటే స్వర్శ సేవా సంస్థలోని ప్రతి ఒక్కరి కృషి ఫలితమేనని తెలిపారు. యువ నేత జేసీ అస్మిత్‌రెడ్డి ప్రసంగిస్తూ స్వర్శ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దాదాపు రూ.86లక్షల వ్యయంతో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌లు పంపిణీ చేపట్టామని తెలిపారు. అనంతరం గత ఫిబ్రవరిలో నిర్వహించిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో ఎల్‌ఎల్‌ఆర్‌లు పొందిన మహిళలకు ఎస్పీ అశోక్‌కుమార్ డ్రైవింగ్ లైసెన్స్‌లను అందజేశారు.

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అగళి, మే 17: టీటీడీ ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానార్చకులు శేషాచార్యులు నేతృత్వంలో స్వామివారికి అభిషేకార్చనలు, ప్రత్యేక అలంకరణలు చేశారు. అదేవిధంగా హోమాన్ని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామిని ప్రత్యేకంగా అలంకరించి వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఉమేష్ ఆధ్వర్యంలో భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందచేశారు.

సంచార ఏటీఎంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
అనంతపురం సిటీ, మే 17: సంచాల ఏటీఎం వాహనాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జి.వీరపాండ్యన్ పేర్కొన్నారు. గురువారం అంబేద్కర్ రోడ్డులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కార్యాలయ ఆవరణంలో సంచార ఏటీఎంను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాబార్డు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో మొబైల్ వ్యాను ద్వారా పూర్తి ఎయిర్ కండీషన్‌తో సంచార ఏటీఎం వాహనాన్ని ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలోని మూరుమూల ప్రాంతానికి కూడా ఈ వాహనం తిరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వుండే ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా పెన్షన్లు, ఉపాధి కూలీలు ఈ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ద్వారా ఉచిత వైద్య సేవలు అందించే నిమిత్తం సంచార వైద్య శాఖ వాహనాలు గ్రామాల్లో ఏలా సేవలందిస్తాయో అదే తరహలో ప్రజలకు ఏటీఎం సంచార వాహనం ద్వారా పొందవచ్చునని తెలిపారు.