అనంతపురం

24న పుట్టపర్తిలో జిల్లా మినీ మహానాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మే 17: ఈ నెల 24న పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని పుట్టపర్తి ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న ధర్మశాలలో తెలుగుదేశం పార్టీ జిల్లా మినీ మహానాడు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మహానాడును ప్రారంభించనున్నారు. ఈ మేరకు గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ జిల్లా సమన్వయ కమిటీ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గతంలో అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లా మినీ మహానాడులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు మూడేళ్ల క్రితం తొలి జిల్లా మినీ మహానాడును ధర్మవరంలో, అనంతరం కళ్యాణదుర్గంలో, గత ఏడాది అనంతపురంలో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నాలుగోసారి జిల్లా మినీ మహానాడును పుట్టపర్తిలో నిర్వహించేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు నియోజకవర్గ మినీ మహానాడును ఈ నెల 20న పుట్టపర్తిలో నిర్వహించాల్సిన ఉంది. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే, చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి నిర్ణయించి ఈ మేరకు జిల్లా నేతలు, అధిష్టానానికి సమాచారం ఇచ్చారు. అయితే జిల్లా కమిటీ సమావేశంలో ఈసారి హిందూపురం పార్లమెంట్ పరిధిలోని పుట్టపర్తిలో జిల్లా మినీ మహానాడు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో నియోజకవర్గ మినీ మహానాడు రద్దు చేశారు. జిల్లా కమిటీ నిర్ణయించిన మేరకు 24వ తేదీ పుట్టపర్తిలో 10వేల మందితో జిల్లా మహానాడును నిర్వహిస్తామని చీఫ్ విప్, ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి సమావేశం అనంతరం తెలిపారు. 2019 ఎన్నికలు రానున్న నేపథ్యంలో పుట్టపర్తిలో నిర్వహించే జిల్లా మినీ మహానాడు ఆఖరుది కావడం విశేషం.

గడువులోగా ‘కియా’ పూర్తి చేద్దాం
* ప్రభుత్వపరంగా అధికారులు సహకరించండి
* అధికారులు, కియా ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్
అనంతపురం, మే 17: భారత దేశ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కియా కార్ల పరిశ్రమను త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉందని, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు ప్రభుత్వ పరంగా సహకారం అందివ్వాలని కలెక్టర్ జీ.వీరపాండ్యన్ ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కియా ప్రతినిధులు, సంబంధిత జిల్లా అధికారులతో కియా కార్ల పరిశ్రమ పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఓయూ ప్రకారం ప్రాజెక్ట్ సైట్‌కు వారంలోపు అగ్రిమెంట్ పూర్తి చేయాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్‌ను ఆదేశించారు. టౌన్‌షిప్, ట్రైనింగ్ సెంటర్, భూమి అవియేషన్‌కు సంబంధించి కేబినెట్ మీటింగ్‌లో ఆమోదం పొందిందని, త్వరలో జీఓ జారీ అవుతుందని తెలిపారు. కియా ప్రదేశంలో హెలిపాడ్, టౌన్‌షిప్, ట్రైనింగ్ సెంటర్ తదితర ప్రదేశాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయన్న అంశాలను జోనింగ్ చేయాలని మున్సిపల్ కమిషనర్ మూర్తిని ఆదేశించారు. కియా కార్ల పరిశ్రమకు సంబంధించిన వ్యర్థ పదార్థాల నిర్వహణకు మడకశిరలో గుర్తించిన భూమిని కియా ప్రతినిధులు చూసి, ఆమోదయోగ్యమైందా, కాదా? తెలియజేయాలన్నారు. కొరియన్ ప్రతినిధులు పిల్లల చదువుకు ఇంటర్నేషనల్ స్కూల్, ఫైవ్‌స్టార్ హోటల్ ఏర్పాటు చేస్తున్నారని, అలాగే అనేక మంది పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని కలెక్టర్ వెల్లడించారు. కొరియన్ల ఆహార పదార్థాల తయారీకి శిక్షణ ఇచ్చేందుకు కొరియన్ శిక్షకులు వస్తున్నారని, పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థినులకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టాలని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రామారావును ఆదేశించారు. అలాగే కార్ల పరిశ్రమలో వెల్డింగ్ పనులు మొదలవుతున్నందున, నియమ నిబంధనల మేరకు ఫైర్ సర్వీసెస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారికిని ఆదేశించారు. కియా ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యమిచ్చేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని పాలిటెక్నిక్, ఐటీఐ, యూనివర్సిటీల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కియా కోసం భూములిచ్చిన రైతు కుటుంబాల్లో అర్హులైన పిల్లలుంటే గుర్తించాలన్నారు. తొలుత శిక్షణ ఇస్తారని, తదుపరి అర్హత కలిగిన వారికి ఉద్యోగాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.