క్రైమ్/లీగల్

భార్యను హత్య చేసిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, జూన్ 12 : కట్టుకున్న భార్యను భర్తే దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన మండలంలోని నెరమెట్ల గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని నెరమెట్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న సునీతమ్మ (32)ను భర్త హనుమంతు ఇంట్లో నిద్రిస్తుండగా గొడ్డలితో తలపై నరికి హత్య చేశాడు. సునీతమ్మకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఇందులో భాగంగానే ఈ విషయమై సోమవారం రాత్రి కూడా గొడవ పడ్డారు. దీంతో ఆగ్రహించిన హనుమంతు గొడ్డలితో భార్య తలపై నరికి హత్య చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి శవ పరీక్ష నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చిన్నగౌస్ తెలిపారు.

తూములో పడి వ్యక్తి ఆత్మహత్య
పరిగి, జూన్ 12 : మండల పరిధిలోని వన్నంపల్లికి చెందిన మాల నారాయణప్ప (42) మంగళవారం పరిగి చెరువు పెద్ద తూములో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో బోల్తా- వృద్ధుడి మృతి
కదిరి రూరల్, జూన్ 12: కదిరి మున్సిపల్ పరిధిలోని హిందూపురం రోడ్డు గట్ల సమీపంలో మంగళవారం ఆటో బోల్తా పడి నల్లమాడ మండలం బాపనకుంటపల్లికి చెందిన గంగిరెడ్డి (68) అనే వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నల్లమాడ నుండి కదిరికి ప్రయాణికులతో వస్తున్న ఆటో గట్ల సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గంగిరెడ్డి మృతి చెందగా, ఎల్‌ఐసీ ఏజెంట్ వెంకటరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఎర్రచందనం దుంగలు స్వాధీనం
* పరారీలో స్మగ్లర్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
తాడిపత్రి, జూన్ 12: తాడిపత్రి మండలం సజ్జలదినె్న గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్థానికులు పోలీసులకు పట్టించారు. వివరాల్లోకి వెళితే నంద్యాల నుంచి మహీంద్రా జైలో కారులో ఎర్రచందనం దుంగలను తాడిపత్రికి అక్రమంగా తరలిస్తుండగా, సజ్జలదినె్న గ్రామం శివారులో గ్రానైట్ ఫ్యాక్టరీ నుంచి గ్రానైట్ వ్యర్థాల లోడుతో రోడ్డుపైకి వస్తున్న ట్రాక్టర్‌ను మహీంద్రా జైలో కారు ఢీకొనడంతో, కారు ముందు భాగంలోని ఇంజన్ దెబ్బతిని కారు ఆగిపోయింది. దాంతో వెనుకనే వస్తున్న డస్టర్ కారులోకి ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు మారుస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులకు స్మగర్లకు జరిగిన ఘర్షణలో డస్టర్ కారు వెనుక అద్దాలు పగిలిపోయాయి. స్పందించిన స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎర్రచందనం స్మగ్లర్లు రెండు కార్లను, లక్షలాది రూపాయలు విలువ చేసే 21 ఎర్రచందనం దుంగలను వదిలిపెట్టి పరారైనారు. రూరల్ ఎస్సై రామకృష్ణారెడ్డి ఎర్రచందనం దుంగలను, మహీంద్ర జైలో, డస్టర్ కార్లను స్వాధీనం చేసుకొని రూరల్ పోలీసు స్టేషన్‌కు తరిలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టామని సీఐ సురేంద్రరెడ్డి తెలిపారు.