జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో పిడిపి ఎమ్మెల్యేపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని పోలీసులు హతమార్చినందుకు నిరసనగా జమ్ము-కాశ్మీర్‌లో ఆందోళనలు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. అధికార పిడిపికి చెందిన ఎమ్మెల్యే మహ్మద్ ఖలీల్ వెళుతున్న వాహనంపై ఆదివారం అర్ధరాత్రి ఆందోళన కారులు రాళ్లదాడికి దిగారు. దీంతో ఖలీల్ వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ఖలీల్‌ను ముఖ్యమంత్రి మెహబూబా పరామర్శించారు.