హైదరాబాద్

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలపై పెరిగిన దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఎస్సీ,ఎస్టీలపై దాడులు మరింత పెరిగాయని, వాటిని నివారించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని మాల సంక్షేమ సంఘం మంగళవారం జాతీయ ఎస్సీ కమీషన్‌ను కోరింది. కమీషన్ డైరెక్టర్ అనంతరాయను కలిసిన మాల సంక్షేమ సంఘం ప్రతినిధుల బృందం ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని కూడా సమర్పించింది. ప్రతినిధులు బత్తుల రాంప్రసాద్, సంఘం గౌరవ అధ్యక్షుడు నిమ్మబాబురావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ,ఎస్టీలపై దాడులు మరింత పెరిగాయన్న విషయాన్ని తాము సమాచార హక్కు చట్టం కింద డిజిపి కార్యాలయం నుంచి సమాచారం సేకరించినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 15 నెలల్లోనే 2879 కేసులు నమోదయ్యాయని వివరించారు. ఎస్సీ,ఎస్టీ యాక్టు 1989 నిబంధనల 16(1) ప్రకారం రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి దానికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా, హోం, ఫైనాన్స్, ఎస్సీ, అభివృద్ధి శాఖ, గిరిజన శాఖ్యామత్యులు, ఎంపి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారిక సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా, నేటికీ నియమించలేదని వివరించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం జనవరి, జూలై మాసాల్లో సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉన్నా, నేటికీ ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని వివరించామన్నారు. దీంతో పాటు జిల్లా స్థాయిలో ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులను సమీక్షించాల్సి ఉన్నా, ఒక్కటి రెండు జిల్లాల్లో మాత్రమే నూతన కమిటీలు ఏర్పాటు చేసి, మిగతా జిల్లాల్లో దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల క్రితం ఏర్పడిన కమిటీలతో తూతూమంత్రంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని రాంప్రసాద్ ఆరోపించారు. సమావేశాలు కూడా నేటికీ పది జిల్లాల్లో దాదాపు 60 సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా, కేవలం 17 మాత్రమే నిర్వహించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అంచనా వేసుకోవచ్చునని వివరించారు. వీటితో పాటు గ్రామస్థాయిలో చట్టంపై అవగాహన కల్పించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను, అంటరానితనం నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా, నేటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదని వివరించటంతో కమిషన్ సభ్యులు సానుకూలంగా స్పందించినట్లు, త్వరలోనే తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేస్తామని డైరెక్టర్ అనంతరాయ హామీ ఇచ్చినట్లు వివరించారు. కమిషన్‌ను కలిసిన వారిలో సంఘం ఉపాధ్యక్షుడు కె.అనంతరామ్, కార్యదర్శి దండు లక్ష్మణ్, భానుప్రసాద్, శంకర్ ఉన్నారు.