హైదరాబాద్

శతాబ్ది ఉత్సవాలపై విద్యార్థి సంఘాలతో చర్చలు సఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం, ఎప్రిల్ 25: ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు స్టాలిన్, దేవిడ్ పేర్కొన్నారు. శతాబ్ది ఉత్సవాలను పండుగలా జరుపుకోవడానికి అన్ని విద్యార్థి సంఘాల నాయకులతో వైస్ చాన్స్‌లర్ ఎస్ రామచంద్ర ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు స్టాలిన్, దేవిడ్ మాట్లాడుతూ ఓయూ పాలక మండలి, విద్యార్థి సంఘాల ఎన్నికలు, ఉద్యోగాల భర్తీ వెంటనే చేయాలని విసి రామచంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఓయూలో చదువుతున్న పిజి, పిహెచ్‌డి విద్యార్థులకు 3000, 8000 స్కాలర్‌షిష్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన విసి రామచంద్రం పాలక మండలి ఏర్పాటు, ఉద్యోగాల నియామకాలను, విద్యార్థుల స్కాలర్‌షిష్‌లపైన ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. విద్యార్థి సంఘాల ఎన్నికల విషయంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
శతాబ్ది ఉత్సవాలను ఘనంగా పండుగలా జరుపుకొందామని విద్యార్థి సంఘల నాయకులు తెలిపారు. విద్యార్థుల లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.
విసిని కలిసిన ఎంపి బాల్క సుమన్
శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాడానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎంపి బాల్క సుమన్ పేర్కొన్నారు. విద్యార్థి సంఘాల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.