బిజినెస్

స్పెక్ట్రం వేలానికి సంప్రదింపుల పత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడు బ్యాండ్ల కోసం విడుదల చేసిన ట్రాయ్ * భాగస్వాముల స్పందనకు గడువు డిసెంబర్ 21

న్యూఢిల్లీ, నవంబర్ 26: టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తరువాత దశ స్పెక్ట్రం వేలం కోసం గురువారం సంప్రదింపుల పత్రాన్ని (కన్సల్టేషన్ పేపర్) విడుదల చేసింది. 700, 900, 2100 మెగాహెర్ట్జ్ సహా ఏడు బ్యాండ్ల స్పెక్ట్రంను మదింపు వేయడానికి, కనిష్ట ధరలను నిర్ధారించడానికి ట్రాయ్ ఈ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. వేలం వేయాల్సిన స్పెక్ట్రం పరిమాణం, స్పెక్ట్రం బ్లాక్ పరిమాణం, స్పెక్ట్రం గరిష్ఠ పరిమితి, అభ్యంతరాలు, స్పెక్ట్రంను మదింపు వేసి, దాని కనిష్ట ధరను నిర్ధారించడానికి అనుసరించాల్సిన పద్ధతులు తదితర అంశాలపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా భాగస్వాములందరినీ (ఈ వేలంతో సంబంధం ఉన్నవారు) ట్రాయ్ కోరింది. సంప్రదింపుల పత్రం విడుదలలో అయిన జాప్యం గురించి కూడా వివరణ ఇచ్చింది. టెలికం డిపార్ట్‌మెంట్ (డిఓటి) జూలై 9న పంపించిన సమాచారం సంతృప్తికరంగా లేదని పేర్కొంది. సంప్రదింపుల పత్రం తయారీలో కీలక పాత్ర వహించే సమాచారాన్ని పంపించాల్సిందిగా టెలికం డిపార్ట్‌మెంట్‌ను జూలై 24న మళ్లీ కోరినట్లు తెలిపింది. ‘డిఓటి అక్టోబర్ 16న రాసిన లేఖ ద్వారా నిర్దిష్టమైన సమాచారాన్ని అందజేసింది. అయితే ఈ సమాచారం కూడా సమగ్రంగా లేదు. దీంతో నవంబర్ 16న డిఓటికి మరో లేఖ రాయడం జరిగింది. అయినప్పటికీ సమయాన్ని ఆదా చేయడం కోసం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేయాలని అథారిటి నిర్ణయించింది’ అని ట్రాయ్ పేర్కొంది. స్పెక్ట్రం వేలం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉంటుందని అంచనా. భాగస్వాములు డిసెంబర్ 21లోగా ఈ సంప్రదింపుల పత్రంపై తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా పంపించవచ్చని, 28లోగా కౌంటర్ -కామెంట్స్ పంపించవచ్చని ట్రాయ్ తెలిపింది. ఈ గడువును పెంచబోమని, అందువల్ల భాగస్వాములు గడువులోగా అభిప్రాయాలను తెలియజేయాలని ట్రాయ్ స్పష్టం చేసింది.