క్రీడాభూమి

విండీస్‌పై ఆసీస్ విజయభేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోబర్ట్, డిసెంబర్ 12: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌ని మూడో రోజునే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 212 పరుగుల భారీ తేడాతో సొంతం చేసుకుంది. చాలాకాలం తర్వాత మళ్లీ టెస్టు జట్టులో స్థానం సంపాదించిన జేమ్స్ పాటిన్సన్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ విజయభేరి మోగించింది. ఏ దశలోనూ గట్టిపోటీని ఇవ్వలేకపోయిన విండీస్ ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోలేకపోయింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను నాలుగు వికెట్లకు 583 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అందుకు సమాధానంగా మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన వెస్టిండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 207 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు, శనివారం ఉదయం ఆటను కొనసాగించి, 223 పరుగులకు ఆలౌటైంది. కెమెర్ రోచ్ తన ఓవర్‌నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించకుండానే జోస్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ నెవిల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. జెరోమ్ టేలర్ (0)ను హాజెల్‌వుడ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. జెర్మైయిన్ గాబ్రియల్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగలేదు.
ఫాలోఆన్‌లో తడబాటు
మొదటి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైన వెస్టిండీస్ ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. ఇన్నింగ్స్ పరాజయం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాల్సిన బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. ఓపెనర్ క్రెగ్ బ్రాత్‌వెయిట్ 94 పరుగులు చేశాడు. జట్టును ఆదుకోవడానికి అతను చేసిన ప్రయత్నానికి సహచరుల నుంచి సరైన సహకారం లభించలేదు. అతనితోపాటు కెప్టెన్ జాసన్ హోల్డర్ (17), జెరోమ్ టేలర్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా వారు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు. దీనితో 36.3 ఓవర్లలో 148 పరుగులకు విండీస్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 269 పరుగులు సాధించిన ఆడమ్ వోగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. (చిత్రం) ఐదు వికెట్లతో అదరగొట్టిన పాటిన్సన్‌కు సహచరుల అభినందన

సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 114 ఓవర్లలో 4 వికెట్లకు 583 డిక్లేర్ (డేవిడ్ వార్నర్ 64, వోగ్స్ 269, షాన్ మార్ష్ 182, జొమెల్ వారికన్ 3/158).
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 70 ఓవర్లలో 223 ఆలౌట్ (డారెన్ బ్రేవో 108, కెమెర్ రోచ్ 31, రాజేంద్ర చంద్రిక 25, జోస్ హాజెల్‌వుడ్ 4/45, నాథన్ లియాన్ 3/43, పీటర్ సిడిల్ 2/36).
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ (్ఫలోఆన్): 36.3 ఓవర్లలో 148 ఆలౌట్ (క్రెగ్ బ్రాత్‌వెయిట్ 94, జాసన్ హోల్డర్ 17, జెరోమ్ టేలర్ 12, జేమ్స్ పాటిన్సన్ 5/27, జోస్ హాజెల్‌వుడ్ 3/33).