క్రీడాభూమి

వరల్డ్ లీగ్ హాకీ టైటిల్ పోరులో బెల్జియం విఫలం .. విజేత ఆస్ట్రేలియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, డిసెంబర్ 6: హాకీ వరల్డ్ లీగ్ (హెడ్‌డబ్ల్యుఎల్) ఫైనల్ టైటిల్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసు కుంది. బెల్జియంతో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో ఈ జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించిం ది. మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆధిపత్యాన్ని కొనసాగించడమే లక్ష్యంగా ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే వారు బెల్జియంపై అవకాశం లభించిన ప్రతిసారీ దాడులు చేస్తూ సాధారణ పరిస్థితుల్లో రక్షణాత్మక విధానాన్ని అనుసరిస్తూ, ప్రపంచ చాంపియన్ స్థాయ ఆటను ప్రదర్శిం చారు. మ్యాచ్ 16వ నిమిషంలో జెరెమీ హేవార్డ్ ద్వారా ఆసీస్‌కు తొలి గోల్ లభించింది. ఈ గోల్ నమోదై న వెంటనే ఆసీస్ రక్షణ వలయాన్ని మరింత కట్టుదిట్టం చేసింది. 37వ నిమిషంలో మాథ్యూ డాసన్ చేసిన గోల్‌తో ఆసీస్ ఆధిక్యం పెరిగింది. ఆతర్వాత బెల్జియం క్రీడాకారులు దాడులు చేసేందుకు ప్రయత్నించగా, అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించిన ఆసీస్ రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. దీనితో ప్రథమా ర్ధం ముగిసే వరకూ మరో గోల్ నమోదుకాలేదు. ద్వితీయార్ధంలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. గోల్స్ కోసం బెల్జియం ప్రయత్నించడం, దానికి ఆసీస్ గండి కొట్టడంతోనే చాలా సమయం గడిచిపోయంది. గోల్స్ కోసం అల్లాడుతున్న బెల్జియం 60వ నిమిషంలో సిమోన్ గనార్డ్ ద్వారా ఒకటి సంపాదించింది. కానీ, ఈక్వెలైజర్ కోసం బెల్జియం చేసిన ప్రయత్నాలు ఫలితంలేదు. ఆరంభం నుంచి మొదలుపెడితే, చివ రి క్షణం వరకూ ఒకే విధంగా, ఒకే వ్యూహాంతో ఆడిన ఆస్ట్రేలియా అందరూ ఊహించిన విధంగానే విజయభేరి మోగించి, ప్రపంచ హాకీలో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది.