ఆటాపోటీ

టీమిండియాకు ఆస్ట్రేలియాలో సవాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత జట్టుకు 2008లో ఆస్ట్రేలియా కూడా పాల్గొన్న కామనె్వల్త్ బ్యాంక్ ట్రై సిరీస్‌లో నాయకత్వం వహించిన మహేంద్ర సింగ్ ధోనీ విజయాన్ని అందించాడు. అప్పటి నుంచి ఇంత వరకూ అతను ఆస్ట్రేలియాపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఏడాది కాలంలోనే భారత జట్టు రెండోసారి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. 2014-15 సీజన్‌లో, వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు చాలా ముందుగానే భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు ఆసీస్‌తో టెస్టు సిరీస్ ఆడింది. ఆతర్వాత ఇంగ్లాండ్ కూడా పాల్గొన్న ముక్కోణపు వనే్డ సిరీస్‌లో పాల్గొంది. అటు టెస్టుల్లో, ఇటు వనే్డల్లో భారత జట్టు ఆసీస్‌పై ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోయింది. ఈసారి పర్యటనలో తొలుత ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ ఆడుతుంది. ఆతర్వాత మూడు మ్యాచ్‌ల టి-20లో పాల్గొంటుంది.
===============
భారత్, ఆస్ట్రేలియా జట్లు మరోసారి క్రికెట్ యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌తోపాటు మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్ కూడా జరగనుంది. అన్ని విధాలా సమవుజ్జీగా కనిపించే ఈ రెండు జట్ల మధ్య పోరాటం ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే గణాంకాలను పరిశీలిస్తే భారత్ కంటే ఆసీస్ బలంగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే ఓడించడం అనుకున్నంత సులభం కాదు. ఆసీస్ నుంచి ఎదురయ్యే సవాల్‌ను మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా ఎంత వరకూ ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది. కాగా, ఇరు జట్లపైనా అభిమానుల నుంచి భారీ అంచనాలు ఉంటాయి. ఆటగాళ్లందరిలోనూ బలాబలాలను తేల్చుకోవాలన్న పట్టుదల కనిపిస్తుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకూ 118 వనే్డ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో ఆస్ట్రేలియా 68, భారత్ 40 విజయాలు సాధించగా, 10 మ్యాచ్‌ల్లో ఫలితం వెలువడలేదు. ఆస్ట్రేలియా మన దేశంలో 51 మ్యాచ్‌లు ఆడింది. 28 విజయాలు సాధించింది. 21 పరాజయాలను ఎదుర్కొంది. ఐదు మ్యాచ్‌లు ఫలితం తేలకుండానే ముగిశాయి. ఇక ఆస్ట్రేలియాలో భారత్ 43 మ్యాచ్‌లు ఆడింది. కేవలం 10 విజయాలను మాత్రమే సొంతం చేసుకుంది. 31 పరాజయాలను చవిచూసింది. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. తటస్థ వేదికలపై ఇరు జట్లు 24 పర్యాయాలు ఢీకొన్నాయి. ఆస్ట్రేలియా 12, భారత్ 9 విజయాలను నమోదు చేశాయి. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. ఈ గణాంకాలను గమనిస్తే, భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి అన్నది స్పష్టమవుతుంది. అంతేగాక, ఇటీవలే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వనే్డ సిరీస్‌ను టీమిండియా కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో ధోనీ సేనకు అడుగడుగునా సవాళ్లు ఎదురుగాక తప్పదు.
భారత్‌దే టాప్ స్కోర్
ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకూ జరిగిన వనే్డల్లో అత్యధిక స్కోరును నమోదు చేసిన ఘనత భారత్‌కు దక్కుతుంది. ఈ జాబితాలో మొదటి రెండు స్థానాలను టీమిండియా కైవసం చేసుకోవడం విశేషం. 2013 నవంబర్ 2వ తేదీన బెంగళూరులో జరిగిన వనే్డలో ఆరు వికెట్లకు 386 పరుగులు చేసింది. అదే ఏడాది అక్టోబర్ 16న జైపూర్ మ్యాచ్‌లో కేవలం ఒక వికెట్ కోల్పోయి 362 పరుగులు సాధించింది. కాగా, భారత్‌పై ఆస్ట్రేలియాకు అత్యధిక స్కోరు 359 పరుగులు. మూడు పర్యాయాలు ఆ జట్టు ఇదే స్కోరును నమోదు చేయడం విశేషం. 2003 మార్చి 23న జొహానె్నస్‌బర్గ్‌లో రెండు వికెట్లకు 359, 2004 ఫిబ్రవరి 8న సిడ్నీలో 5 వికెట్లకు 359 తిరిగి 2013 అక్టోబర్ 16న జైపూర్‌లో 5 వికెట్లకే 359 చొప్పున ఆస్ట్రేలియా స్కోర్లు చేసింది.
అత్యధిక స్కోరేకాదు.. అత్యల్ప స్కోరుకూడా భారత్‌దే కావడం గమనార్హం. 1981 జనవరి 8న సిడ్నీలో జరిగిన వనే్డలో భారత్ 63 పరుగులకే కుప్పకూలింది. భారత్‌పై ఆసీస్ 1991 డిసెంబర్ 8న పెర్త్ మ్యాచ్‌లో అత్యల్పంగా 101 పరుగులు చేసింది.
భారీ విజయాలు
భారీ విజయాల జాబితాలో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని ఆక్రమిస్తుంది. 2004 ఫిబ్రవరి 8న సిడ్నీలో జరిగిన వనే్డలో ఈ జట్టు 208 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తుచేసింది. ఆతర్వాత మూడు స్థానాలు (162, 152, 125 పరుగుల తేడా) కూడా ఆసీస్‌వే. కాగా, ఆస్ట్రేలియాపై భారత్ అత్యుత్తమ విజయాన్ని 1983 జూన్ 20న చేమ్స్‌ఫోర్డ్‌లో సాధించింది. ఆ మ్యాచ్‌లో 118 పరుగుల తేడాతో గెలిచింది.
అత్యల్ప విజయాల్లోనూ ఆస్ట్రేలియానే మొదటి మూడు స్థానాలను ఆక్రమించింది. 1987 అక్టోబర్ 9న చెన్నైలో, 1992 మార్చి 1న బ్రిస్బేన్‌లో ఈ జట్టు భారత్‌ను కేవలం ఒకే ఒక పరుగు తేడాతో ఓడించింది. ఒక మ్యాచ్‌లో మూడు, మరో మ్యాచ్‌లో నాలుగు పరుగుల ఆధిక్యంతో గెలిచింది. కాగా, భారత్‌కు అత్యల్ప విజయం 5 పరుగుల తేడా. 1996 నవంబర్ 3న మొహాలీలో భారత్ అతి కష్టం మీద ఆసీస్‌ను ఓడించింది.

- శ్రీహరి