అవీ .. ఇవీ..

చిత్రకళకు చిత్రిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫొటోగ్రఫీ ఒక కళ. ప్రపంచంలోని ప్రకృతి అందాలను తిలకిస్తూ తమ కెమెరాల్లో బంధించడం కొందరికి హాబీ. మరికొందరికి ప్రాణం. అలాంటివారి కోసం ప్రఖ్యాత నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ వరల్డ్ ట్రావెలింగ్ పోటీలు నిర్వహిస్తోంది. జూన్ 30లోగా ఫొటోగ్రాఫర్ల నుండి ఎంట్రీలను కోరుతోంది. ఇప్పటికే కుప్పలు తెప్పలుగా వస్తున్న అందమైన ఫొటోలలో కొన్నింటిని తమ వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేసింది. న్యూహాంప్‌షైర్‌కు వెళ్లే మార్గం ఆకాశంలోంచి చూస్తే ఎలాగుందే చూసి పొంగిపోయిన ఫొటోగ్రాఫర్ మనీష్ మతాని తన ద్రోన్ కెమేరాతో ఆ దృశ్యాన్ని ఇలా బంధించాడు. అలాగే మరో ఫొటోగ్రాఫర్ స్టాస్ బర్తనికస్ కాలిఫోర్నియాలోని డెత్‌వ్యాలీలోని సాల్ట్ లేక్ దృశ్యాన్ని అద్భుతంగా తన కెమెరాలో బంధించాడు. ఇలాంటి అద్భుతమైన చిత్రరాజాలు మరెన్నో రానున్నాయనడంలో సందేహమే లేదు.

- భారతి