అవీ .. ఇవీ..

రెండు రంగుల కళ్ల పిల్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పిల్లికి ఉన్న ఆదరణ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది సూపర్ మోడల్ క్యాట్. ఈ మధ్య చైనాలో పంపిణీ అయిన ప్రఖ్యాత ‘వోగ్’ మ్యాగజిన్ కవర్‌పై దీనికి చోటు దక్కింది. దీని కళ్లలో ఒకటి ఆకుపచ్చగానూ, మరోటి నీలిరంగులోనూ ఉండటం పెద్ద ఆకర్షణగా మారిపోయింది. లండన్‌లో పెంపుడు జంతువులను సంరక్షించి మోడలింగ్ చేసే సంస్థ దీని విశిష్టతను గమనించి దాని యజమాని సాజా సిల్వస్‌ను సంప్రదించింది. ఇక అక్కడినుంచి దాని దశ తిరిగింది. మోడలింగ్‌లో దానికి తిరుగులేని ప్రాధాన్యత ఏర్పడింది. బ్యాగులోంచి తొంగి చూడటం అనే భంగిమలో అది ఆరితేరిపోయింది. ఫొటోషూట్‌లో అది అదరగొట్టేస్తుంది. షూటింగ్ సమయంలో మన మోడల్స్‌కన్నా అదే ఎక్కున తింటుందని మురిసిపోతోంది దాని యజమాని సిల్వస్. అన్నట్లు ఈ సూపర్ మోడల్ పిల్లి పేరు...సాటిర్నా ఎస్పరేంజ సిల్వజ్. థామస్ ఎయిర్‌వేస్ విమానయాన సంస్థ ప్రకటనల్లోను, స్టెల్లా వెక్‌కార్ట్‌ని సన్‌గ్లాసెస్ సంస్థ వ్యాపార ప్రకటనల్లోనూ ఇదే కీలకపాత్ర పోషించిందికూడా!

భారతి