అవీ .. ఇవీ..
ఈగిల్ ఫైట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 11 March 2017
- భారతి
ఆకాశంలో ఎగురుతూ రివ్వున దూసుకువచ్చి చేపలను, చిన్నచిన్న జీవులు, కోడిపిల్లలను తన్నుకుపోయే గద్దలు ఇప్పుడు ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్లపై యుద్ధం ప్రకటించాయి. నిషిద్ధ ప్రాంతాలలో గుట్టుచప్పుడు కాకుండా తిరుగుతున్న డ్రోన్లను పసిగట్టి పట్టుకుని గిరాటేస్తున్నాయి. అది అబద్ధం కాదు. ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్ సహా ఆరేడు దేశాలు గద్దలకు సైనిక శిక్షణ ఇచ్చి మరీ అక్రమంగా జొరబడుతున్న ద్రోన్లను పట్టుకుంటున్నాయి. తాజాగా ఫ్రాన్స్ నాలుగు గోల్డెన్బాల్డ్ జాతి గద్దలకు ఈ శిక్షణ ఇచ్చి సానుకూల ఫలితాలు రాబట్టారుకూడా. స్పెయిన్ అందరికన్నా ముందుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. బ్రిటన్ ఏకంగా ఒక దళాన్ని ఇందుకోసం వినియోగిస్తోంది.