అవీ .. ఇవీ..

నిప్పుతో హెయిర్‌కట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కత్తెర లేదా మిషన్‌తో హెయిర్‌కట్ చేయడంలో గొప్పకానీ, కొత్తదనం కానీ ఏముందనుకున్నాడు పాలస్తినాలోని ఓ బార్బర్. ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఓ ఐడియావచ్చింది. అమలు చేశాడు. ఇప్పుడు అదో పెద్ద సంచలనంగా మారిపోయింది. సెలూన్‌కు వచ్చిన కస్టమర్ జుత్తుకు పల్చటి ఓ ద్రావకం రాసి బ్లోటార్చ్ వెలిగించి ఆ మంటలతో నాజూగ్గా కావలసిన తీరులో జుత్తును కాలుస్తాడన్నమాట. తలకు ఏమీ కాకుండా, సెగతో చర్మం పాడవకుండా ముందే ఓ ద్రావకాన్ని పూస్తాడు. అంతే, మొదట్లో భయపడినా రానురాను అది క్రేజ్‌గా మారిపోయింది. ఇక్కడకు వచ్చే కస్టమర్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఒకరికి 20 షెకల్స్ చొప్పున వసూలు చేసే ఈ బార్బర్ పేరు రమదాన్ బడ్వాన్. గాజాలో ఇతడి బ్లోటార్చ్ సెలూన్ అంటే తెలియనివారుండరుమరి.

- Bharathi