అవీ .. ఇవీ..

వనరాజా వందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ వృక్షంలా ఆకులుఅలములతో దుస్తులు తయారు చేసుకుని పోటీలోకి దిగడం ఓ ఉత్సవం. గ్రీన్‌మాన్ స్ప్రింగ్ ఫెస్టివల్‌గా పిలిచే ఈ వేడుక బ్రిటన్‌లోని బోయె ట్రేసీ ప్రాంతంలో విస్తృతంగా జరుగుతుంది. పదహారవ శతాబ్దం నుంచి ఈ సంప్రదాయం ఉంది. మేడే వేడుకల్లో భాగంగా, విత్తనాలు నాటి సేద్యానికి సిద్ధమైన రైతులకు కాస్తంత విశ్రాంతి దొరికిన సందర్భంగా ఈ వేడుక నిర్వహిస్తారు. బ్రిటన్ జానపద సంప్రదాయ శైలిలో నృత్యం చేసే ‘మోరిస్ డాన్సర్స్’ ఈ వేడుకలో పాల్గొంటారు. ఆకులు, మొక్కలు, కొమ్మలు, కాండాలనే వస్త్రంగా ధరించి వీధుల్లో తిరుగుతారు. ఆ రోజు అలా తిరిగివారిలో ఎక్కువగా ఆకర్షించిన వ్యక్తిని ‘గ్రీన్‌మాన్’గా గుర్తిస్తారు. ఇది పూర్తిగా స్థానిక గిరిజన తెగల సంప్రదాయ వేడుక.

- భారతి