అవీ .. ఇవీ..

తల్లికి పిల్లభారమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఫొటోలో కనిపిస్తున్న శునకం పేరు మోలి. లాబ్రడార్ జాతికి చెందినది. జాగ్రత్తగా గమనిస్తే దాని కూనలతోపాటు ఓ రెండు పందిపిల్లలకూ పాలిస్తున్న దృశ్యం గోచరిస్తుంది. తన పిల్లలతోపాటు వాటికీ పాలిచ్చి, ఆడుకోవడం చూసేవారిని అబ్బురపరుస్తోంది. ఆరుపిల్లలు పుట్టిన తరువాత తల్లి మరణించడంతో అనాధలైన వాటిలో రెండింటిని ఈ శునకం వద్దకు చేర్చారు మోలీ సంరక్షకులు కెరెనా స్పియర్, అడమ్ జంబోర్స్కి. వారి ప్రయత్నం ఫలించి మోలీవద్ద అవి బాగానే అలవాటుపడ్డాయి. మిగతావాటిని వేరే వరాహం వద్దకు చేర్చారు ఆ ఇద్దరూ. జాతులు వేరైనా తల్లిమనసు ఒక్కటేనని, పిల్లలు తల్లికి భారం కాదని అనిపించడం లోదూ..వీటిని చూస్తే.

- భారతి