అవీ .. ఇవీ..

‘జోడు గుర్రాల’ శుభ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కాట్‌లాండ్‌లో ప్రఖ్యాత శిల్పి ఆండీ స్కాట్ రూపొందించిన ఈ జోడు గుర్రాలను ‘ది కెల్పీస్’ అని పిలుస్తారు. 100 అడుగుల ఎత్తుతో, ఒక్కోటి 300 టన్నుల ఇనుముతో రూపొందించారు. హెలిక్స్‌లోని కేరన్ నదికి సంబంధించిన ఫోర్త్ అండ్ క్లైడ్ కాలువలపై వీటిని నిర్మించారు. ఈ కాలువలు చుట్టుపక్కల ఉన్న 16 ప్రాంతాలను కలుపుతూంటాయి. ఈ జోడుగుర్రాల శిల్పాలు కాలువలపై ఉంటాయి. అంటే ఆ కాలువల ద్వారా ప్రయాణించాలనుకునేవారు ఈ జోడు గుర్రాలున్న ముఖద్వారం మీదుగా చేరుకుంటారన్నమాట. సరే, అవి ప్రజలకు అందుబాటులోకి వచ్చి మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం వాటిని శుభ్రపరచి, పరిశీలించే పనులు చేపట్టింది. ఇందులో భాగంగా సుశిక్షితులైన ప్రత్యేకబృందంలోని ముగ్గురు సభ్యులు వాటిలో అణువణువు, అంటే కళ్లు, నోటిలోని పళ్లవంటి భాగాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. రెండు నెలల ఈ ప్రాజెక్టు కొద్ది
రోజుల క్రితం
మొదలైంది.