అవీ .. ఇవీ..

అందమైన ‘బరిష్టా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణ కొరియాలో బరిష్టా అన్నది ఓ అద్భుతమైన కాఫీలాంటి డ్రింక్ అన్నమాట. దానికి కాస్తంత కళను దట్టించాడు ఓ కళాకారుడు. మీగడకు కొన్ని రకాల రంగులు అద్ది అందమైన దృశ్యాన్ని ఆ కప్పులోని ద్రావకంపై సృష్టించడమే అతడి లక్ష్యం. క్రీమ్‌ఆర్ట్, ఫ్లవర్ ఆర్ట్ సమ్మిళితంగా లీ కాంగ్ బిన్ ఈ కళను సృష్టించాడు. సియోల్‌లోని ఓ కాఫీషాప్ నిర్వహిస్తున్న అతడు కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ ప్రయోగం చేశాడు. అయితే ఆ కాఫీ లేదా బరిష్ఠా డ్రింక్‌పై ఆషామాషీ బొమ్మలు వేయడం లేదు. ప్రపంచంలోనే పేరెన్నిగన్న చిత్రకళాకారులు వేసిన బొమ్మలను ప్రతిబింబించేలా వేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్‌లో జాక్ స్పారో బొమ్మను కూడా మనం అతడి హోటల్‌లోని బరిష్టా కప్పులో చూడొచ్చు. మొత్తం మీద బరిస్ఠా బాగుందికదూ!

- భారతి