అవీ .. ఇవీ..

నిలువెత్తు నిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అత్యంత పొడవైన మహిళగా, పొడవైన కాళ్లున్న మహిళగా, ఎతె్తైన క్రీడాకారిణిగా గిన్నిస్ రికార్డు సాధించిన మోడల్ ఈమె. రష్యాకు చెందిన ఎకటెరినా లిసిన ఏకంగా 6 అడుగుల 9 అంగుళాల పొడవు ఉంది. ఆమె ఎడమకాలు 132.8 సెంటీమీటర్లు (52.2 అంగుళాలు), కుడికాలు 132.2 (52.0 అంగుళాలు) పొడవున్నాయి. పొడవైన కాళ్లున్న మహిళగా ఇప్పుడు ఆమె గిన్నిస్ రికార్డు సాధించింది. ఆమె కుటుంబ సభ్యులందరూ పొడగరులే. ఆమె సోదరుడు 6.6, తండ్రి 6.5, తల్లి 6 అడుగుల పొడవున్నారట. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఆమె పాల్గొనడం విశేషం. కాగా ఆ పోటీల్లో బాస్కెట్‌బాల్ పోటీలో పాల్గొన్న ఆమె కాంస్య పతకం కూడా కొట్టేసింది. ఇక అమెరికాకు చెందిన అయానా విలియమ్స్ అతిపొడవైన చేతిగోర్లున్న మహిళగా గిన్నిస్ రికార్డు కొట్టేసింది. 23 ఏళ్లుగా ఆమె గోళ్లను పెంచుతోంది. ప్రతి గోరు సగటున 2 అడుగుల పొడవుండగా మొత్తం చేతివేళ్ల గోళ్ల పొడవు 18 అడుగులు కావడం విశేషం.

- భారతి