అవీ .. ఇవీ..

చిలకల చెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ చెట్టు .. పచ్చటి ఆకులతో కళకళలాడుతోందని అనుకుంటే మీరు తప్పులో కాలువేసినట్లే. ఎందుకంటే ఆ కొమ్మలనిండా ఆకుపచ్చగా ఉన్నవి ఓ రకం చిలుకలు. బడ్జీస్‌గా పిలుచుకునే ఈ చిన్నపాటి చిలుకలు వేలాదిగా కలసి తిరగడం, ఇలా నీటిమడుగులున్నచోట అన్నీకలసి నీళ్లు తాగడం, పక్కనే ఉన్న చిన్నచిన్న మొక్కలు, చెట్లపై గుంపులుగుంపులుగా వాలడం వాటికి ఇష్టమైన పని. దూరంనుంచి చూస్తే ఇదేదో చెట్టులా కన్పిస్తుంది. శత్రువులనుండి రక్షణకు ఈ పక్షులు ఇలా చేస్తూంటాయి. ఒక్కోసారి ఈ పక్షుల గుంపు ఎంతగా ఉంటుందంటే నాలుగైదు ఫుట్‌బాల్ మైదానాల సైజు ఎంతో అంత. ఒక్కోసారి లక్ష పక్షులు కలసి రయ్‌మంటూ ఎగరడమూ సాధారణమే.

పంక్ ఆర్ట్
పంక్ కల్చర్ అంటే తెలుసుగా...హోరెత్తించే రాక్ సంగీతఝరి అనుకోండి. మంద్రస్థాయి అంటే ఎరుగని ఈ రాక్ సంగీత ప్రవాహంలో మునిగితేలిపోయే సంస్కృతి నలభై ఏళ్లక్రితం లండన్‌లో ప్రారంభమైంది. అందుకు గుర్తుగా ఈ మధ్యే ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఈ ముద్దుగుమ్మ ఇలా కన్పించింది.

ఆటోపోలో
పోలో ఆడటం ఖరీదైన వ్యవహారమే. కానీ ఆడాలని తపన ఉంటే పోలో ఇలాకూడా ఆడొచ్చని నిరూపించారు శ్రీలంకవాసులు. ఆటోల్లో పోలో మాదిరిగా ఇలా ఆడుతూ కన్పించారు గాలె వీధుల్లో కొందరు క్రీడా ప్రేమికులు. దీనికి ‘టుక్-టుక్’ అని ముద్దుగా పేరుపెట్టారుకూడా.

సముద్రగర్భంలో మ్యూజియం
సముద్రగర్భంలో శిల్పాలతో ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచన రావడమే తరువాయి, ప్రముఖ అంతర్జాతీయ శిల్పి జాసన్ డికెయిర్స్ టేలర్ పనిమొదలెట్టాడు. అద్భుతమైన శిల్పాలను తీర్చిదిద్ది వాటిని సముద్రగర్భంలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన రీఫ్‌పై ప్రతిష్ఠించాడు. అయితే వీటిని చూడటం సాధారణ పౌరులకు కష్టమే. కాస్త డైవింగ్, సముద్ర అడుగుభాగాన తిరగాడగలిగే వారికి మాత్రమే దీనిని చూడటం సులవు. స్పెయిన్‌లోని లాస్‌కొలరాడో తీరంలోని స్పానిష్ ఐలండ్ ‘లాంజ్‌కోటి’ జలాల్లోని సీబెడ్‌పై ‘అట్లాంటిక్ మ్యూజియ’ ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్న శిల్పాలన్నీ జాసన్ రూపొందించినవే.

అదో వేడుక
తోటి ప్రయాణికులు చక్కగా దుస్తులు ధరించి ఉంటే తన మానాన తను ఇలా నిక్కరుతో రైలులో ప్రయాణిస్తూ...మిగతావారిని పట్టించుకోకుండా నవలాపఠనంలో మునిగిపోయిన ఈ వ్యక్తిని చూస్తే చిరాకేస్తోంది కదూ...కానీ అలా చిరాకుపడటానికి కుదరదు మరి. ఎందుకంటే మెక్సికోలో ఏటా పాంట్లు ధరించకుండా (అంటే ఇలా చిన్నపాటి నిక్కర్లు వేసుకుంటారులెండి) ఇలా ప్రయాణించేందుకు ఓ వేడుక జరుపుకుంటారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఫ్లాష్‌మాబ్ సంస్కృతిని ఇష్టపడేవారు ఇలా చేస్తారనుకోండి. మెక్సికోలో ‘నో పాంట్స్ సబ్‌వే రైడ్’ దినోత్సవం నాడు ఈ వ్యక్తి ఇలా ప్రయాణించాడన్నమాట. ఎవడి పిచ్చి వాడికానందం..!

-భారతి