అవీ .. ఇవీ..

నిమ్మ... బొమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నిలువెత్తు మహిళ బొమ్మ పూర్తిగా నిమ్మకాయలు, పళ్లతోనే తయారు చేశారు. ఈమధ్య ఫ్రాన్స్‌లోని మెంటన్‌లో నిర్వహించిన లెమన్ ఫెస్టివల్‌కోసం ఈ నిమ్మబొమ్మను నిర్మించారు.
దాదాపు 140 మెట్రిక్ టన్నుల నిమ్మకాయలు వినియోగించి దీనిని తయారు చేశారు. ‘అమర్‌కోర్ట్’ చిత్రంలోని ఓ మహిళ పాత్రను పోలిన బొమ్మలా దీనిని రూపొందించడం విశేషం.

గజరాజు సాక్షిగా...
జంతువులను ప్రేమించడం, ఆరాధించడం, వాటితో కలసి పనిచేయడం కొత్తకాదు. కానీ ఈ కళాకారులకు తను నిత్యం కలిసిమెలిసి జీవించే ఏనుగు సాక్షిగా పెళ్లిచేసుకుని అదంటే తమకు ఎంత ఇష్టమో చెప్పకచెప్పి అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేశారు. హంగేరీలోని బుడాపెస్ట్‌లో ఓ సర్కస్ కంపెనీలో పనిచేసే మెర్రెలుకేజిలి, జోసెఫ్ రిచ్చెర్ ఒక్కటవ్వాలనుకున్నారు. తమకు ఇష్టమైన ఓ ఏనుగు సమక్షంలో వారిద్దరూ ఒక్కటయ్యారు. ఈ వేడుక చూసిన ఆ ఏనుగు ఎంచక్కా ఘీంకారం చేసి ఆనందాన్ని ఇలా వ్యక్తం చేసింది.

ఇదో వేడుక
వేలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవమేకదా... కానీ ఆస్ట్రేలియాలో వేలంటైన్స్ డే సందర్భంగా కొందరు సామాజిక కార్యకర్తలు వినూత్నంగా ఈ వేడుకను నిర్వహించారు. సిడ్నీలోని సౌరా ప్రాంతంలో ఇలా ఆవుల బొమ్మలను తయారు చేసి వాటికి ప్రేమికుల దినోత్సవానికి సంకేతమైన రంగులను వేసి ఆనందించారు. పశుసంపదను ప్రేమించాలని వారి సందేశమన్నమాట.

లెగోజిరాఫి
చైనాలోని షాంఘై నగరంలో ఓ షాపింగ్‌మాల్ వద్ద ఏర్పాటు చేసిన లెగో జిరాపీ బొమ్మ అందర్నీ ఆకట్టుకుంటోంది. 450 గంటలపాటు శ్రమించి, 40వేల లెగోపీస్‌లను వినియోగించి దీనిని తయారు చేశారు. ఇంతకీ లెగో జిరాఫీ ఎత్తు ఎంతో తెలుసా. 6.16 మీటర్లు.

-భరతి