అవీ .. ఇవీ..

ఫియర్‌లెస్ గర్ల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా ఆర్థిక రాజధాని మాన్‌హట్టన్ (న్యూయార్క్)లోని భారీ కాంస్య విగ్రహం వాల్‌స్ట్రీట్ బుల్ ఎదురుగా ధైర్యంగా, ఠీవిగా నిలుచుని తీక్షణంగా చూస్తున్నట్లు కనిపిస్తున్న ఈ ‘్ఫయర్‌లెస్ గర్ల్’ కూడా ఓ కాంస్య విగ్రహమే. లాటిన్ బాలిక పోలికలతో 50 అంగుళాల పొడవు, 110 కేజీల బరువు ఉండే ఈ విగ్రహాన్ని ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించారు. కిర్‌స్టన్ విస్బల్ అనే కళాకారుడు దీనిని రూపొందించాడు. వివిధ కార్పొరేట్ సంస్థలు ఎక్కువమంది మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాలని, నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్న స్ఫూర్తితో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం దిగువభాగంలో ఓ నినాదాన్ని తీర్చిదిద్దారు. ‘మహిళల శక్తిని తెలుసుకోండి. ఆమె అద్భుతాలు సృష్టించగలదు’ అన్నది ఆ నినాదం సారాంశం. ఇప్పటికే మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న కొన్ని సంస్థల తరపున సేకరించిన నిధులతో ఈ ప్రతిమను రూపొందించడం విశేషం.

- భారతి