అవీ .. ఇవీ..

నచ్చితే... నగ్నంగా తినొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్‌లో ఓ అరుదైన రెస్టారెంట్ తెరవబోతున్నారు. కృత్రిమ వెలుగుజిలుగులకు దూరంగా అంతా సహజవాతావరణంలో ఈ రెస్టారెంట్‌లో ఎవరైనా ఆహారాన్ని తినొచ్చు...తాగొచ్చు. అయితే ఇక్కడ ఓ ఆఫర్ ప్రకటించారు. అదీ ఇష్టమైనవారికే. ఈ రెస్టారెంట్‌కు వచ్చేవారు ఓ తరహా గౌన్‌ను ధరించాల్సి ఉంటుంది. వారు ఏ రకం దుస్తుల్లో ఉన్నా అక్కడకు వచ్చాక మార్చుకోవల్సిందే. ఆ గౌన్లూ వద్దనుకునేవారు తమ దుస్తులను విడిచి నగ్నంగా ఆహారాన్ని తినొచ్చు. దుస్తులు మార్చుకోవడానికి తగిన ఏర్పాట్లు చేశారు. వీడియోలు, ఫొటోలూ నిషేధ అనుకోండి. ఆహారం తినడం పూర్తయ్యాక మళ్లీ దుస్తులు ధరించి వచ్చేయవచ్చు. ఇది ఇష్టంలేనివారు వారిచ్చిన గౌన్లతో మమ అన్పించవచ్చు. ఇలాంటి రెస్టారెంట్‌లో విందు ఆరగించడానికి సిద్ధంగా ఉన్నారా అని ఆ సంస్థ నిర్వాహకులు ఆన్‌లైన్‌లో అడిగితే 30వేలమంది సై అన్నారుట. జూన్‌లో తెరిచే ఈ రెస్టారెంట్ పేరు ‘బున్యాడా’. ఇది మూడునెలల పాటు సేవలందిస్తుంది.

భారతి