అవీ .. ఇవీ..

వానరశిల్పాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య చైనాలో కొత్త సంవత్సరం వేడుకలు వినూత్న రీతిలో జరుపుకున్నారు. ఒక్కో ఏడు ఒక్కో ప్రాణి పేరుతో వారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మంకీ ఇయర్‌గా వారు వేడుకలు జరుపుకున్నారు. ఇక ఈ ఏడాదంతా ఎటు చూసినా వానరాలను పోలిన వస్తువులు, పార్కులు, దుస్తులు, ఒకటేమిటి అన్నీ వాటి పేరుతోనో, రూపంతోనో చైనాలో దర్శనమివ్వడం మామూలే. అదిగో షాండెంగ్ ప్రావిన్స్‌లోని జినన్ ప్రాంతంలో ఇలా కోతులను పోలిన శిల్పాలు దర్శనమిస్తున్నాయి.

ఢీ అంటే ఢీ
యుద్ధానికి సిద్ధపడ్డ మల్లయోధుల్లా కన్పిస్తున్న ఈ రెండు గొరిల్లాలను చూస్తే భయమేస్తోందికదూ! డెవెన్ నగరంలోని పయంగ్టాన్ జూలో ఈ రెండు గొరిల్లాలూ పోరాటానికి సిద్ధపడ్డాయి. 30 ఏళ్ల వయసున్న 172 కిలోల బరువుగల పెర్టినాక్స్ గొరిల్లాకు తెగకోపం వచ్చింది. తనకన్నా చిన్నదైన 13 ఏళ్ల కియోండా గొరిల్లాపై నోరు తెరచి, హూంకరిస్తూ, ఛాతీపై చరుచుకుంటూ ఆధిపత్యాన్ని చాటుతోంది. కానీ సీనియర్ గొరిల్లాకన్నా ఈ యువ గొరిల్లా బలిష్టంగా, ఎక్కువ బరువుతో (186కిలోలు) ఉండటం విశేషం.

వెచ్చదనంకోసం కొత్త దుస్తులు
అస్సాంలోని కరజంగా నేషనల్ పార్కులోని సంరక్షణ కేంద్రంలో ఉన్న ఈ రెండు యువ ఏనుగుల పేర్లు రూప, రుషి. గాయాలపాలై ఇబ్బందులు పడుతున్న ఈ రెండింటిని ఐఎఫ్‌ఎడబ్ల్యు రెస్క్యూ టీం రక్షించింది. శీతల గాలులనుంచి వీటిని కాపాడటానికి, రాత్రిపూట తొడిగేందుకు వీటికి కొత్తకొత్త దుస్తులు అప్పటికప్పుడు తయారు చేశారు. వాటి కొలతలకోసం నానా తంటాలు పడ్డారు డిజైనర్ పండిట్ బసమత్రి. మొత్తాని ఆయన రూపొందించిన దుస్తులతో అవి హాయిగా నిద్రపోయాయట.

థాయ్‌లాండ్‌లో పాండాలు!
చైనాకే పరిమితమైన పాండాలు థాయ్‌లాండ్‌లో ప్రత్యక్షమయ్యాయేమిటా అని అనుకోకండి. ఫ్రాన్స్‌కు చెందిన కళాకారుడు పౌలో గ్రాంజియాన్ రూపొందించిన వందలాది పాండా బొమ్మలను బ్యాంకాక్‌లోని ఛాంగ్ నాన్సి వంతెనపై ఇలా ప్రదర్శించారంతే.

వరాహం కాదు..నీటిఏనుగు
పక్కకు చొచ్చుకువచ్చిన దంతాలను చూసి ఇదేదో వరాహం అనుకోకండి. ఇది నీటిఏనుగేసుమా. నిజానికి వీటి దంతాలు నోటి లోపలిభాగంలోనే ఉంటాయి. అవి నోటిని తెరిచినప్పుడు భయంకరంగా కన్పించే ఈ దంతాలు ఈ హిప్పోపోటమస్‌కు బయటకు, అదీ పక్కగా పెరుగుతూ వచ్చాయి. జాంబియాలోని లువాంగ్వా నేషనల్ పార్క్‌లో ఇది కన్పించింది.

-భారతి