అవీ .. ఇవీ..

ఈ పిల్లులకు బొచ్చు ప్రత్యేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దట్టమైన బొచ్చుతో, పొట్టవద్ద సంచీల్లా వేళ్లాడేలా ఉండటం వీటి ప్రత్యేకత. సముద్రమట్టానికి 9500 అడుగుల ఎత్తున మంచు ప్రాంతాల్లో ఇవి జీవించడానికి ఇష్టపడతాయి. పొడవైన కోరపళ్లు వీటికి అదనపు బలం. చదునైన ముఖం, పొట్టి చెవులు, తీక్షణమైన చూపువల్ల ఇవి మిగతా పిల్లులకన్నా భిన్నంగా కన్పిస్తాయి. అన్నట్లు వీటి పేరు...‘పల్లాస్ క్యాట్స్’. మధ్య ఆసియాలో ఎక్కువగా కన్పిస్తాయి. మిగతా పిల్లులకు కనుపాపలు నిలువగా ఉంటే వీటికి వృత్తాకారంలో ఉంటాయి. మిగతా ఏ జాతి పిల్లులకూ లేనంత ఒత్తుగా, వీటి శరీరం, తోకలపై బొచ్చు ఉంటుంది. హఠాత్తుగా శత్రువులపై దాడి చేసి వేటాడటం వీటికి అలవాటు. శీతాకాలంలో గ్రే కలర్‌లోను, వేసవిలో కాస్త ఎరుపుతోకూడిన గ్రే కలర్‌లోనూ వీటి బొచ్చు ఉంటుంది.

భారతి