అవీ .. ఇవీ..

కళ్లకు కట్టిన వాస్తవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని దృశ్యాలు చూస్తే ఔరా అనిపిస్తుంది. నిజమేనా అన్న సందేహం కలుగుతుంది. కానీ ఫొటోగ్రాఫర్ల నైపుణ్యం, తెగువ కొన్ని ‘నిజా’లను మన కళ్లముందు ఆవిష్కరిస్తుంది. అలాంటి దృశ్యాల్లో ఓ రెండు ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ఉత్తమ ఫోటోగ్రాఫర్ పోటీలను నిర్వహించింది. వేలాది ఎంట్రీలు వచ్చాయి. వాటిలో ఈ ‘సుడిగాలి’ ఫోటోకు రెండో బహుమతి వచ్చింది. కొలరాడోలోని రే నగరంలో మే 7న సంభవించిన ఈ సుడిగాలి (టోర్నడో) చుట్టుముడుతుండగా అక్కడే చిక్కుకున్న ఫొటోగ్రాఫర్ టోరీ షే ఆస్ట్‌బర్గ్ ప్రాణాలకు తెగించి ఫొటో తీశాడు. ఆ తరువాత దానినుంచి తప్పించుకున్నాడు. ఇక గౌరవ పురస్కారం పొందిన మరో ఫోటో చూడండి. జెల్లీ ఫిష్‌లంటే కొన్ని జాతుల తాబేళ్లకు ఇష్టం. అలా దొరికిన ఓ భారీ జెల్లీ ఫిష్‌ను మొదట ఒక తాబేలు తినడం మొదలెట్టింది. ఆ తరువాత మరికొన్ని చేరాయి. చివరకు బలమైన రెండు తాబేళ్లు ఆధిపత్యం సాధించి జెల్లీఫిష్ విందును ఆరగించాయి. ఈ మొత్తం దృశ్యాన్ని అతి సమీపం నుంచి గమనించి డైవర్ ఫొటోగ్రాఫర్ స్కాట్ పోర్టెన్లీ తన కెమెరాలో బంధించాడు. ఆస్ట్రేలియాలోని బైరాన్ బే తీరంలో ఈ దృశ్యం అతడి కళ్లల్లో పడింది. ఈ చిత్రాల్లో అపురూపమైన వాస్తవాలు, ఫొటోగ్రాఫర్ల నైపుణ్యం కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయికదూ!