అవీ .. ఇవీ..

రోబో డైనోసార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదో ఒకటి కొత్త విషయం కనుగొంటేనే అందర్నీ ఆకర్షించవచ్చు. తామేమిటో నిరూపించుకోవచ్చు. జపాన్‌కు చెందిన ‘ఆన్-ఓర్ట్ కార్పొరేషన్’ ఆలోచన కూడా అదే. పదేళ్లపాటు కష్టపడి భారీ డైనోసార్ రోబోలను తయారు చేసింది. ప్రత్యేక శిక్షణ పొందిన కొందరిని ఎంపిక చేసి వాటిని నిర్వహించేలా తీర్చిదిద్దింది. ఇప్పటివరకు 13 డైనోసార్ రోబోలను సిద్ధం చేశారు. తాజా రోబో ‘టైరనోసారస్’ రకానికి చెందినది. జురాసిక్ పార్కు చిత్రంలో గ్రాఫిక్స్ మాత్రమే చూశారు. ఇక్కడ నిజమైన డైనోసార్లలా కనిపించే రోబోలు విస్మయం కలిగించబోతున్నాయి. వాటి అరుపుల, ఈలలు, గుసగుసలు అన్నీ విభ్రాంతి కలిగించేలా ఈ డైనోరోబోలను తయారు చేశారు. అలా తయారైన డైనో రోబోలతు చిన్నపాటి డెమోకూడా ఇచ్చారు. ఈ ఫోటోలను చూస్తే తెలుస్తుంది ఆ రోబోలు ఎలా ఉన్నాయో!

- భారతి