అవీ .. ఇవీ..

నిప్పుల్లో నడక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాస్తంత దూరం నడవాలంటేనే ఆపసోపాలుపడిపోయేవాళ్లు ఈ లోకంలో చాలామందే ఉంటారు. అలాంటి ఈ లోకంలో కణకణలాడే నిప్పుల్లో ఆనందంగా, తన్మయత్వంతో నడిచేవాళ్లూ ఉంటారు. వియత్నాంలోని హ జియాంగ్‌లో పె థెయ్ తెగకు చెందిన గిరిజనులు ఇలా నిప్పుల్లో నడచి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. స్మిత్‌సోనియన్ మ్యాగజైన్ వార్షిక ఫొటోగ్రఫీ పోటీలకోసం వచ్చిన ఎంట్రీలలో ఈ ఫోటో అలాంటి సన్నివేశాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ అద్భుతాన్ని కెమెరాలో బంధించాడు బిన్ దౌన.