మీకు తెలుసా ?

తోడేళ్లు పండ్లూ తింటాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుక్కల జాతికి చెందిన తోడేళ్లలో ‘గ్రే వోల్ఫ్’ చాలా దేశాల్లో కనిపిస్తాయి. కోరపళ్లు, బలమైన దంతాలు, దవడలతో చిన్నచిన్న జంతువులను చీల్చిచెండాడి పీక్కు తినడంలో వీటికి పోటీ లేదు. ఇది అందరకూ తెలిసిందే. కానీ చాలా సందర్భాలలో ఇవి కొన్ని రకాల పళ్లను వెతికివెతికి మరీ తింటాయి. ముఖ్యంగా పియర్స్ పళ్లంటే వీటికి ఎంతో ఇష్టం. ఫిగ్స్, యాపిల్స్ నైట్‌షేడ్ కౌబెర్రి, బిల్‌బెర్రి పళ్లనూ, లిల్లీ పూలనూ తింటాయి. వేసవిలో కర్బూజా పళ్లను ఆరగించడం వీటి స్పెషాలిటీ. ఇది నమ్మాల్సిన నిజం సుమా! ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. తోడేళ్లు ఊళ పెడతాయికదా! అయితే వర్షం పడుతున్నప్పుడు, వాటికి ఏ ప్రమాదం లేనప్పుడు అసలు ఊళపెట్టవు. ప్రమాదం పొంచి ఉన్నా, వాటి గుంపులోని మిగతావాటికి ఆహారం, భద్రత పరమైన సమాచారం అందివ్వాలన్నా అవి ఊళపెడతాయంతే. పైగా బాగా ఎదిగిన తోడేళ్లు మాత్రమే ఊళపెడతాయట. పిల్లలు ఊళపెట్టవుగాక పెట్టవు. వీటి బొచ్చుతో చాలా వస్తువులు తయారు చేస్తారు. కానీ విషప్రయోగంతో మరణించిన తోడేళ్ల బొచ్చు ఎందుకూ పనికిరాదట తెలుసా!