ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? ( జనవరి 29 నుండి ఫిబ్రవరి 4 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

అనుకున్న లక్ష్య సాధనతో కార్యాలు పూర్తి చేయిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు యోగిస్తాయి. విద్య, ఉద్యోగ, వైద్య రంగాలు శుభాలను అందిస్తాయి. వ్యాపార విస్తరణకు సదవకాశం. పెట్టుబడులకు లాభసాటి సమయం. రవాణా, ఏజెన్సీలు, స్టేషనరీ రంగాల వారికి ఆర్థిక, హార్థిక వృద్ధి. కొత్త పరిచయాలు ఉపకరిస్తాయి. మీ స్థితిని సమీక్షించుకోండి. చర్చలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

బాధ్యతాయుతమైన, మేలైన విధంగా పనులు పూర్తి చేస్తారు. ఎదుటివారిని తక్కువగా అంచనా వేయవద్దు. దంపతులు శుభాలను అందుకుంటారు. ఆస్తి విలువ, సంఘ కార్యాలందు ప్రగతి, గుర్తింపు ఉంటుంది. విద్యార్థులు జయాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షలలో విజయం. విదేశీ యత్నాలు ఫలవంతమవుతాయి. బోధన, కమ్యూనికేషన్స్, లలిత కళలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అన్నింటా సృజనాత్మకంగా ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. ముఖ్యులతో ప్రయాణాలు సుఖవంతమవుతాయి. ప్రయాణాలు, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలు ఉల్లాసంగా సాగుతాయి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఉద్యోగ రంగాలందు పెనుమార్పులుంటాయి. ఆర్థిక విషయాలు తృప్తినిస్తాయి. ట్రాన్స్‌పోర్ట్, విద్య, వైద్య, ఉద్యోగ, ఐ.టి. అడ్వర్టయిజ్‌మెంట్ రంగాల వారికి మంచి ఫలితాలు అందుతాయి. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. మీ మాటల్లో, చేతల్లో ఆవేశాన్ని కన్పించనీయకండి. స్పెక్యులేషన్‌లో మిశ్రమ ఫలితాలు. బంధుమిత్రులతో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యం జాగ్రత్త. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. వారి విషయాల్లో జోక్యం కూడదు. ఓ మంచి వార్త ఆలోచింపజేస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

ఆదాయం కోసం కొత్త మార్గాలు అనే్వషిస్తారు. వ్యయాలు ఆదాయం కంటె మించేట్లుంది. అనుకోకుండా బంధుమిత్రులు వచ్చే అవకాశముంది. కొన్ని పనులందు మీరు ఆశించిన దాని కంటె లబ్ధి పొందే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఉపకరిస్తాయి. పెద్దల ఆశీస్సులు, ఉద్యోగులకు అధికారుల అండదండలుంటాయి. విద్య, వ్యాపార, చేతి వృత్తులు, చిన్న వ్యాపారాలు అనుకోకుండా తేలికపాటి లాభాలను అందుకుంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

అనుకున్న శుభకార్యాలు, ఫలవంతమైన ప్రయత్నాలు ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగాలు ఫలవంతమవుతాయి. ప్రయాణాలందు, వాహనాలపై మితిమీరిన వేగం వద్దు. బంధువుల ఇంటికి వెళతారు. విలువైన వస్తువులతో ప్రయాణాలు క్షేమకరం కాదు. వైద్య, రవాణా, వాహన, విద్యా రంగాల వారికి ఫలవంతమైన సమయం. అతి ఎప్పటికీ మంచిది కాదు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు అనుకూలిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
బుద్ధిబలంతో, నిబద్ధతతో అనుకున్నవి సాధిస్తారు. ఒంటరి వారు జంటలవుతారు. అనుకోకుండా ధనం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. వ్యాపార, పారిశ్రామిక రంగాలు మార్పులకు లోనవుతాయి. అన్నింటా పోటీ తత్వం అధికమవుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. చేసే కార్యాలందు నేర్పు, గుర్తింపు వస్తుంది. దంపతులు ప్రశంసలందుకుంటారు.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

ఆర్థిక పురోగతి ఉంది. ఖర్చు నియంత్రణ ఉండాలి. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మిత్రుల పనులందు సాయపడతారు. విద్యార్థులు శ్రమానుకూలంగా లబ్ధిని పొందుతారు. వాణిజ్య, విద్య, ఉద్యోగ రంగాలు గతంకన్నా వృద్ధి బాట పడుతాయి. స్ర్తిలు అనుకున్నవి సాధిస్తారు. ప్రయాణాలందు అప్రమత్తత మంచిది. స్పెక్యులేషన్ అనుకూలిస్తుంది. పెద్దలతో మాటలు అనుకూలిస్తాయి. కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులు గొడవలకు దూరంగా ఉండటం మంచిది.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

విద్య, విదేశీ వ్యవహారాదులు అనుకూలిస్తాయి. చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. రాజకీయ, సినీ, క్రీడా రంగాలు లబ్ధిని పొందుతాయి. ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. రవాణా, బోధన, ఆర్థిక రంగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. దంపతులు వదంతులకు దూరంగా ఉండండి. నిర్మాణ రంగాల వారికి శుభప్రదం. శుభకార్యాలందు అనుకూల ఫలాలు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆరోగ్యానికి ఔషధ సేవనం అవశ్యం. పెట్టుబడులు లాభిస్తాయి. సన్నిహితుల సహకారంతో పనులు పూర్తి చేసుకుంటారు. పుణ్య కార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మంచి వార్తలు వింటారు. విందులు వినోదాలందు మిత్రులతో కలిసి పాల్గొంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. దూరపు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగ రంగంలో పదోన్నతులు, ఆర్థిక వ్యవహారాలు ఫలప్రదం. కొత్త ప్రణాళికలు అమలుచేసేందుకు మంచి సమయం. సంకల్పం వికల్పం కాకుండా చూసుకోండి.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

ఆర్థిక వ్యయాలు అనుకూలిస్తాయి. నిర్ణయాలకు అనుకూలంగా కార్యాలు పూర్తి చేస్తారు. మిత్రులు, తోటి ఉద్యోగులు సహకరిస్తారు. వృత్తి, వ్యాపారాలందు లక్ష్యాలు పూర్తవుతాయి. విలువైన వస్తువులు ఖరీదు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలందు నగలతో అప్రమత్తంగా ఉండండి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. అడ్వర్టయిజ్‌మెంట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగాలు మెరుగవుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్నవి సాధించుకుంటారు. పొదుపు అవకాశాలు మెరుగవుతాయి. పైకం సమయానికి అందుతుంది. విదేశీ వ్యవహారాలు ఫలప్రదమవుతాయి. బహుమతులు అందుకుంటారు. కుటుంబంలో సంతోషాలుంటాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. జన సంబంధాలు విస్తరిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు.

ఎ.సి.ఎం. వత్సల్, 93911 37855