AADIVAVRAM - Others

బాతు (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాతులు చాలా గమ్మత్తుగా ఉంటాయి. వాటి జీవనం ఎక్కువగా నీటిలోనే ఉంటుంది. అవి ఎప్పుడైతే నీటినుంచి బయటకు వస్తాయో అప్పుడు వాటి రెక్కలను విదిలించి నీటిని తొలగించుకుంటాయి.
మనం ఓ వింతైన ప్రపంచంలో నివసిస్తున్నాం. మంచి విషయాల కన్నా చెడు విషయాలని ఎక్కువ మాట్లాడుకునే ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. వార్త్తాపత్రికల నుంచి టీవీలకు వచ్చాం. టీవీలనుంచి అంతర్జాలానికి, ఫోన్లనుంచి స్మార్ట్ఫోన్లకి, ఎస్‌ఎంఎస్‌ల నుంచి వాట్సప్‌లకి అభివృద్ధి చెందాం. మంచి విషయాలతో బాటు వ్యతిరేక భావనలు వున్న విషయాలు ఎక్కువగా మనల్ని ప్రభావితం చేస్తూ వుంటాయి.
హత్యలు, కిడ్నాపులు, మానభంగాలు, దోపిడీలు, మోసాలు లాంటి వార్తలు ప్రధానంగా మనకు టీవీల్లో దర్శనమిస్తూనే వుంటాయి. అదేవిధంగా సెనే్సషనల్ వార్తలని ఎక్కువగా ప్రసారం చేస్తూ వుంటారు. వాటిపట్ల ఎక్కువమంది ఆకర్షితులవుతూ వుంటారు. పేజి-3 ప్రముఖుల వార్తలు ఎక్కువగా ఆకర్షిస్తూ కనిపిస్తూ వుంటాయి.
మంచి పనులు చేస్తున్న వ్యక్తులు కూడా మరెంతోమంది వున్నారు. వాళ్ల గురించిన వార్తలు తక్కువగా కనిపిస్తూ వుంటాయి. చెడు వార్తలకి, వ్యతిరేక భావనలు కలిగించే వార్తలు ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. మన చుట్టూ వున్న చాలామంది వ్యతిరేక భావనలు కలిగించే విషయాలనే చెబుతూ వుంటారు. ‘నువ్వు ఇది చేయలేవు. అది చేయలేవు’ అంటున్న వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తూ వుంటారు.
ఈ ప్రపంచంలో ద్వంద్వం వుంది. మంచి భావనలు, చెడు భావనలు అందులో భాగం. మనం ఏవి స్వీకరించాలి అన్నది మన చేతిలో వుంది. ఎంపిక చేసుకోవడం మన చేతిలో వుంది. మనం ఆశావహ దృక్పథం వున్న మనిషిగా వుండాలన్నా, వ్యతిరేక భావనలు వున్న మనిషిగా వుండాలన్నా అది మన చేతిలో వుంది. ఎంపిక చేసుకోవాల్సింది మనమే.
మనకు చెడు భావనలు కలిగించే వార్తలని చూడమని మనకు ఎవరూ చెప్పడం లేదు. ఒక్క చిన్న బటన్ నొక్కితే టీవీ బంద్ అవుతుంది. అంతర్జాలం కూడా సెలవు తీసుకుంటుంది.
వ్యతిరేక భావనలు ఎక్కువగా వున్న ప్రపంచంలో మనం నివసిస్తున్నప్పటికీ ఎంపిక చేసుకునే శక్తిని భగవంతుడు మనకు ఇచ్చాడు. అది మన చేతిలో వుంది.
ఉదయం లేచి స్నానం చేసి రెడీ అయిన తరువాత ఏ డ్రెస్సు వేసుకోవాలోనన్న ఎంపికతో మన దినచర్య మొదలవుతుంది. ఆ రోజు ఏ కూర తినాలన్నది కూడా మన ఎంపికను బట్టి వుంటుంది. ఇన్ని ఎంపిక చేసుకుంటున్న మనం ఎలాంటి భావనలతో వుండాలన్నది ఎంపిక చేసుకోలేమా? అది మన చేతిలోని పని.
రోజులో ఒక్కసారైనా బాతును గుర్తుకు తెచ్చుకోవాలి. ఉదయమే గుర్తుకు తెచ్చుకుంటే మరీ మంచిది. అది రెక్కల్ని విదిల్చి తనమీద పడిన నీటిని వదిలించుకుంటుంది. మనమీద పడుతున్న చెడు భావనల్ని బాతులాగా మనం వదిలించుకోలేమా?
మంచి భావనలను ఎంపిక చేసుకునే శక్తిని భగవంతుడు మనకు ఇచ్చాడు. అర్థం చేసుకునేందుకు బాతును కూడా సృష్టించాడు.
సంతోషాన్ని సంపాదించుకోవడం మన చేతిలోని పని.