అక్షరాలోచన

పరమపద సోపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరూ నా వాళ్లనుకుని
తమ వాళ్లను వూళ్ల వద్దనే వదిలేసి
పొలిమేరలలో పహరా కాస్తున్నారు
పరాయవాడి పాదం సరిహద్దు మీద
ముద్ర వేయకూడదని దీక్షబట్టి
చప్పుడు పడనీయని రెప్పలతో
చలి దుప్పటిని చీల్చుకుని
మరీ దృష్టిని సారిస్తున్నారు
ఎక్కడో చిన్న అలికిడి
దుప్పిని మించిన వేగంతో
శబ్దం దిశగా పరుగులు
వురుముల్లేని పిడుగుల్లా
తూటాల వర్షం దేహాన్ని తడిపింది
వులిక్కిపడ్డ బెబ్బులులు
ప్రత్యుత్తర ఘోష చేశాయ
సగం తడిసిన దీపావళి టపాసుల్లా
ఆయుధాలు మొరాయంచాయ
పొరుగువాడి విజృంభణలో
ప్రాణాలు కొన్ని దేహాలు విడిచాయ
వీర జవానులు అమరులైనారు
నిస్వార్థం నేలలో పూడ్చబడింది
కోటానుకోట్ల లావాదేవీల వెనుక
విదేశీ తుప్పు తుపాకుల బేరంలో
వేలకోట్లు వెనకేసుకున్న రాజకీయం
పేలని బాంబుల సరంజామా ఇచ్చిందని
ప్రాణం ఒడ్డిన వీర జవానుకు తెలియదు
దేశం కోసం దహనమయన
దేశభక్తుని కుటుంబం వీధిపాలు
దగుల్బాజీ రాజకీయ చతురుల
వంశపారంపర్యాలు గద్దెలనేలు
పద్ధతి లేని పరమపద సోపానంలో
పేదవాడి చుట్టూ సాములే
పెద్దవాడి ప్రక్కన నిచ్చెనలే

- శింగరాజు శ్రీనివాసరావు, 9052048706