మనలో - మనం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి. వెంకట్రావు, ఉయ్యూరు
మనకు జాతీయ అవార్డులు రావా? అని అభిమానులు ధైర్యంగా ప్రశ్నించిన రోజే తెలుగు సినిమా అంతర్జాతీయ ఖ్యాతి సాధిస్తుంది అన్నారు ఇటీవల ఎస్‌పి బాలు...
ఎవరిని ప్రశ్నించాలి?

ఉపు ప సత్యనారాయణ, తెనాలి
అభిమానుల జేబులు కొల్లగొడుతూ చిత్రసీమలో సూపర్ స్టార్స్‌గా ఎదిగి అభిమానులే తమ శక్తిగా భావిస్తూ రాజకీయాల్ని శాసించాలనే వింత ధోరణి పెరిగిపోతుంది. భవిష్యత్తులో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది?
కొత్తగా చెడేది ఏమీ ఉండదు.

దాదాపు రెండు దశాబ్దాలుగా పోస్ట్‌కార్డు ధర 0.50పై, ఇన్‌లాండ్ లెటర్ 2.50పై.గా వుంది. చలామణిలో లేని 0.50 నయాపైసల ధరను అలాగే వుంచాలనే నిర్ణయం వెనుక తపాలాశాఖ వారి ఉద్దేశ్యము?
అంత తక్కువ ధర పెడితేనైనా సెల్‌ఫోన్లూ, ఎస్‌ఎంఎస్‌ల మోజు తగ్గి ఉత్తరాలు రాసుకునే పాత అలవాటుకు జనం మళ్లుతారన్న ఆశ కావచ్చు.

ఎ.సి.నాథ్, హైదరాబాద్
మీకు అందిన రచనలను నిష్పక్షపాతంగా పరిశీలించటానికి ఆమోదయోగ్యమైన కాలపరిమితిని పాటించి ఫలితాన్ని వెంటనే ఫోన్ మెసేజ్ ద్వారా ఆయా రచయతలకు తెలియజేస్తే బాగుంటుంది. తద్వారా వారి నిరీక్షణకు పరిష్కారం లభిస్తుంది.
మంచి సూచనే. తప్పక పరిశీలిస్తాం.

సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా
భారత ప్రతిపక్షాలు ఎప్పుడూ నోట్ల రద్దుపై ఫీట్లు చేస్తున్నారే తప్ప పాక్ పోరు గూర్చి, చైనా చెలగాటం గురించి పట్టించుకోరేం?
అవి రాజకీయంగా గిట్టుబాటు కాని అంశాలు కాబట్టి.

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
కారణం ఏదైనా ఉన్నత చదువులు చదివినవారు కూడా ఇటీవల ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యే పరిష్కారమా?
కాదు. మానసిక దౌర్బల్యానికి చదువుతో నిమిత్తం లేదు.
వైజాగ్ విమానాశ్రయంలో జగన్ తనను అడ్డగించిన పోలీసు అధికారితో ‘ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావ్. రెండేళ్లుంది. ఎవర్నీ మర్చిపోను’ అని అన్నట్లు అన్ని పత్రికల్లో వచ్చింది. రెండేళ్ల తర్వాత తనే కాబోయే సిఎం అనే దానికి సంకేతమా లేక వాచాలత్వమా?
తెంపరితనం.

కుంచం రామారావు, విజయనగరం
తమిళులు పోరాటంతో జల్లికట్టు క్రీడను సాధించుకున్నారు. అందరూ ఒక్కటై సాధించుకున్నారు. మనం అంతా ఒక్కటై ప్రత్యేక హోదా సాధించలేకపోయాం. జగన్ ఒక్కడే హోదా కోసం పోరాడుతున్నాడు. అతనికి ఎవ్వరూ సపోర్టు ఇవ్వడం లేదు పాపం.
అందరి సపోర్టు పొందడానికి ఆయన ఎంత గట్టిగా ప్రయత్నించాడు?

ఎస్. శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా
తమిళ ప్రజలు జల్లికట్టు స్ఫూర్తి తీసుకుని ప్రత్యేక హోదా కోసం ఆంధ్రులు పోరాడాలని పవన్ కల్యాణ్ ప్రకటనలు చేస్తూ, వారికి తమ పార్టీ మద్దతిస్తుందని వక్కాణించారు. కాని ఇతను ఒక ఎంఎల్‌ఏ కూడా కాదు. తనంత తాను ఓ నాయకుడై ఆజ్ఞాపిస్తున్నాడు. అయతే ఆంధ్రులు తెలంగాణ విభజన చేయవద్దని ఐదు నెలలు పోరాడితే ఇతనేం పోరాటం చేశాడు.
తెలియదు.

శ్రీమతి కె.సుజాత నాగరాజారావు, చెన్నై
పాలాభిషేకం దివంగతులకా లేక సజీవులకు కూడానా? చేసిన పాపం పోవాలంటే పాలాభిషేకమా?
అలాగే ఉంది. పాపాలాభిషేకం.

కొటికలపూడి మధుసూదనరావు, నిజామాబాద్
బ్రాహ్మడికి పుట్టి అన్యమతస్తుడిని, విదేశీయుడిని ప్రేమించి పెండ్లి చేసుకుని ఫిరోజ్‌ఖాన్‌ను ఫిరోజ్‌గాంధీగా మార్చి, తన తనయుడికి ఇటాలియన్ క్రిస్టియన్ మతస్తురాలిని భార్యగా చేసి కులాలు లేవు, మతాలు లేవు, దేశాలు లేవు, మానవులంతా ఒకటే అని నిరూపించిన ఇందిరకు పాలాభిషేకం చేయడం ద్వారా కాంగ్రెస్ ఆమె ఘనతను ప్రపంచానికి చాటిచెప్పడం మంచిదే కదా?
ఔనౌను.

ఎం. కనకదుర్గ, తెనాలి
దేశంలో దళితులు, మైనారిటీలపై జరిగే దాడులకు నిరసన అంటూ పెద్ద ఎత్తున గొంతు చించుకునే కుహనా మేధావులు, సెక్యులరిస్టులు హిందూ దేవతలను, హిందూ మతగ్రంథాలపై, హిందువుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను అతి దారుణంగా అవమానిస్తూ ప్రచారాలు జరుగుతుంటే నోరెందుకు మెదపరు?
సెక్యులర్ మడి చెడుతుంది కనుక.
*

ప్రశ్నలు
పంపాల్సిన
చిరునామా

మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్,
సికిందరాబాద్ - 500003.

email : sundaymag@andhrabhoomi.net