అక్షరాలోచన

మరణ ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్రభావిత సమాజంలో పౌరసత్వం ఆపాదించబడిన
అసమర్థ బడుగు జీవిని!
అణువణువు స్వార్థ కణాల కోలాహలం మధ్య
అమీబాలా చలిస్తున్న ఏకకణజీవిని
నేను చనిపోయాను మిత్రమా!
ఆగు! ఆగాగు!
అనవసరంగా నా మరణాన్ని ప్రకటించకు!

ఒక్క కన్నీటి చుక్కా నా కోసం వృథా కానీకు!
నా ప్రకటన నేనే ప్రచురించాలనుకుంటున్నాను
నా శరీరం నిండా ఇప్పుడు తీపిగుర్తులే
వాటినన్నింటినీ పంచేసేయ
బ్రతుకునీడుస్తూ ‘అమరత్వం’ ఆశించడం
అమానుషత్వం కదూ?
చూడు మిత్రమా!
అవయవ ఖండాలు ఊపిర్లు పోసుకుంటున్నాయ
అపర బ్రహ్మలై ‘జీవత్వం’ నింపుకుంటూ
‘చిరంజీవిత్వం’ వైపు పయనవౌతున్నాయ
వద్దు మిత్రమా! నా దేహం మంచుపెట్టెలో కప్పెట్టకు!
నిజం! నిజంగానే నాకు నీవు నివాళులర్పిసాతవా?
నా గుండె ఎప్పుడూ స్పందిస్తూనే వేరొకరి జీవితం కావాలి
నా కళ్ళు కబోదుల కనుపాపలై
కమనీయత్వాన్ని కనగలగాలి!
నా కాలేయం కుమిలే బ్రతుకుకు
పునర్జీవన సంజీవినై పురుడు పోసుకోవాలి
నా మూత్రపిండాలు మలిగే జీవికి
వెలుగుల వెల్లువలై ఆశల చిగురులొత్తాలి
నేను అంటున్న ప్రతి కణం శకలం - సకలం
నిర్జీవమై నేను నువ్వే కాదంటూ
నువ్వే జీవితాలకు నవోదయం అందించాలి
అదే మిత్రమా!
చీకటి నుండి వెలుగుకు ప్రయాణించడం!
మృతత్త్వం నుండి అమృతత్త్వంలోకి సాగిపోవటం

- బి.ఎస్. నారాయణ దుర్గ్భాట్టు బాపట్ల, సెల్: 9346911199