'క్లాప్' కొట్టు గురూ!

క్రేజీ భామ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేసింది ఒక్క చిత్రమే.. అయినా ఈ అమ్మడు క్రేజీ భామగా మారిపోయింది. టాలీవుడ్‌లోనే కాదు, కోలీవుడ్‌లోనూ ఈ బ్యూటీకి అవకాశాలు పెరిగిపోతున్నాయి. ఆమె ఎవరో కాదు, కేవలం నాని సరసన ‘మజ్ను’లో చేసిన కేరళకుట్టి అను ఎమ్మాన్యుఎల్. ‘మజ్ను’ పెద్ద హిట్టేమీకాదు.. అయినా ఆ చిత్రంలో ఈ బ్యూటీ పెర్‌ఫార్మెన్స్.. గ్లామర్‌లుక్.. అందర్నీ కట్టిపడేశాయి. ఆ చిత్రమే ఆమెను తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలను తెచ్చిపెడుతోంది. బిజీతారని చేసేయడానికి సిద్ధమవుతోంది కూడా. ఆ ఊపుతో వచ్చిన అవకాశాలకు కొదువేలేదు. రాజ్‌తరుణ్‌తో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, గోపీచంద్‌తో ‘ఆక్సిజన్’తో పాటు తమిళం, తెలుగులో యాక్షన్ హీరోగా బాగా గుర్తింపువున్న విశాల్ సరసన ఓ చిత్రం.. విక్రమ్ హీరోగా గౌతమ్‌మీనన్ రూపొందించబోయే ‘్ధృవ నక్షత్రం’, పవన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో సెకండ్ హీరోయిన్‌గా అవకాశం.. ఇలా అనేక చిత్రాల్లోనూ అవకాశాలున్నాయట. ఇవన్నీ నిజమై, విడుదలైతే ఈ అమ్మడి రేంజ్ ఎలా వుంటుందో ఊహించలేం. అతి తక్కువ కాలంలోనే టాప్‌రేంజ్‌కు వెళ్లడానికి అన్నీ ఈ అమ్మడిలో వున్నాయని సినీ విశే్లషకులు చెబుతున్నారు. ఆల్ ది బెస్ట్ అను!!