మనలో - మనం

మనలో మనం ( ఎడిటర్‌తో ముఖాముఖి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళాబత్తుల సత్యనారాయణమూర్తి, విశాఖ
లెక్కలు చూపలేని కరెన్సీ 500, 1000 రూపాయల నోట్లు మొత్తం కోటీ 60 లక్షల రూపాయలు తిరుమల దేవునికి కానుకలుగా హుండీలో వేయడం సరైన పనేనా? స్వామికార్యం స్వకార్యంగా వాడుకుంటున్న ఇటువంటి దొంగ భక్తుల్ని అప్పగించకపోతే ఈ చిత్తు నోట్లు కానుకలుగా వస్తూనే వుండవా?
తప్పొప్పుల సంగతి దేవుడు చూసుకోగలడు. అవి దొంగనోట్లు కావు. దేవస్థానానికి చెల్లే నోట్లే.

బి.ఆర్.సి మూర్తి, విజయవాడ
జల్లికట్టు, కోడిపందాలు నిషేధించిన న్యాయస్థానం మున్ముందు రోడ్డు కూడళ్లలో భోగిమంటలు కూడా నిషేధిస్తుందేమో?
ఔను. ఏ ‘పేటా’ వాడో ఆ కేసూ పెట్టగలడు.

ఆంధ్రులెవరైనా నోబెల్ ప్రైజ్ సంపాదిస్తే మాట వరసకు చంద్రబాబు వందకోట్లిస్తానన్నాడే అనుకోండి. నిధుల కొరతలో వున్న నూతన రాష్ట్రంలో అది సాధ్యమా?
సాధ్యాసాధ్యాల సంగతి తర్వాత! అసలలా ఆఫర్ పెట్టడమే ఏడ్చినట్టుంది.

వయస్సును బట్టి ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్ నిర్ణయంచినట్లే అదే ఫార్ములాను సీనియర్ సిటిజన్లకు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేటును వర్తింపజేయవచ్చు కదా. కనీసం నాన్ పెన్షనర్లకైనా పెద్ద మనసుతో...
అలా చేస్తే మంచిదే.

కనకదుర్గ
దేశ ప్రజలలో భక్త్భివం విపరీతంగా పెరిగిపోయంది. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు విపరీతంగా చేస్తున్నారు. అయతే ప్రజల మనస్సులు ఇంకా ఆందోళనలు, అశాంతి, ఈర్ష్యా అసూయాద్వేషాలతో నిండి వున్నాయ. ఒకరి ఉన్నతిని మరొకరు సహించలేకపోతున్నారు. సమాజంలో అహింస, అవినీతి అప్రతిహతంగా పెరిగిపోతోంది. ఆధ్యాత్మికత మానవులను సంస్కరించలేకపోతోందనిపిస్తోంది. లోపం ఎక్కడ ఉందంటారు?
అది భక్తి కాదు కక్కుర్తి. నిజమైన భక్తులు నూటికి ఒకరుంటే గొప్ప. దాదాపుగా అందరూ నిలువెల్లా స్వార్థంతో, అంతులేని కోరికలతో రగిలిపోయేవారే. దేవుడి ముందు ఓ పువ్వు పెట్టి, ఓ ఊదుపుల్ల వెలిగించి, ఏ బెల్లంముక్కో నైవేద్యం పెట్టి - అడ్డమైన డిమాండ్లను దేవుడిముందు పెట్టేవాళ్లే. అలాంటివారికి ఇతరులను చూస్తే అశాంతి, ఈర్ష్యాద్వేషాలు ఎందుకు ఉండవు? లోపం ఆధ్యాత్మికతది కాదు. ఆధ్యాత్మికత ఏ కోశానా లేని మన దొంగ భక్తుల స్వార్థపరాయణత్వానిది.

మా ప్రభుత్వానికి అనుకూలంగా రాసే ఆ రెండు పత్రికలు నేనెప్పుడూ చదవను. మాకు వ్యతిరేకంగా రాసినా, మా ప్రభుత్వంలో జరిగే అవకతవకలను ఎత్తి చూపించే ఆ పత్రికనే నేను చదువుతాను, అందువలన నా శాఖలో జరిగే పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం మాకు వుంటుంది అని ఒక అమాత్యుడు ఈమధ్యే బహిరంగంగా సెలవిచ్చారు. వాస్తవాలకు రాజకీయ రంగు పులిమి, మసి పూసి మారేడుకాయ చేసి, పబ్బం గడుపుకునే పత్రికాధిపతుల వైఖరి సబబేనా? ప్రజలకు వాస్తవాలను నిర్భయంగా అందించాల్సిన అవసరం వీరికి లేదా?
ఉన్నది. మీరన్న కళలో మోతుబరి పత్రికలన్నిటివీ అందె వేసిన చేతులే. మడి కట్టుకున్న ఆచారవంతులు ఎవరూ లేరు.

శ్రీనివాస్ ములుగూరి
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చరిత్ర వక్రీకరణ అనీ, బ్రాహ్మణ చక్రవర్తిని ఒక కమ్మ చక్రవర్తిగా చూపారని సోషల్ మీడియాలో చర్చలు. దీనిపై మీ వివరణ?
సినిమాలో చరిత్రను వెతకటం పనికిమాలిన పని.

టి. సాయ సంతోషిణి రీతిక, అనకాపల్లి
గౌతమీపుత్ర శాతకర్ణికి ఏ.పి. ప్రభుత్వం పన్ను మినహాయంపు ఇచ్చి రాణి రుద్రమదేవికి ఇవ్వకపోవడం చంద్రబాబు తనపట్ల పక్షపాతం చూపారంటున్నారు గుణశేఖర్. ఏమంటారు?
ఎంతైనా బావమరిదిది ప్రత్యేక హోదా.

యశ్వంతరావు శేషగిరిరావు, ధవళేశ్వరం
గడ్డకట్టే చలిలోనూ, 50 డిగ్రీల ఎండలోనూ 12 గంటలు నుంచుని డ్యూటీ చేసే బిఎస్‌ఎఫ్ సిపాయల భోజనం రేషన్ అధికారులు అమ్మేసుకుని వాళ్లకి కాలీ కాలని రొట్టెలు, నీళ్ల పప్పు మాత్రం పెడుతున్నారని ఒక సైనికుడు తేజ్ బహదూర్ యాదవ్ వీడియో పంపించి బహిర్గతం చేశాడు. అలాగే ఒక సిఆర్‌పిఎఫ్ సిపాయ కూడా. ఈ సంగతి బహిర్గతం చేసినందుకు ఆఫీసర్ల మీద చర్య తీసుకోకుండా క్రమశిక్షణ ఉల్లంఘన కింద సదరు బాధిత సిపాయలను శిక్షించారు. భ్రష్టాచార్ గట్రా అని అరిచే మోదీకి ఇది పట్టదా?
పట్టింది కాబట్టే కాస్తయనా కదలిక వచ్చింది.

అగస్టా గట్రా కుంభకోణాలే కాక తిండి కూడా కుంభకోణమేనా?
మిలిటరీలో అవినీతి చాలాకాలంగా ఉన్నదే.

ప్రశ్నలు
పంపాల్సిన
చిరునామా

మనలో మనం,
ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్,
సికిందరాబాద్-500003.

email : sundaymag@andhrabhoomi.net